Share News

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం : బీజేపీ

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:19 AM

ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయ డంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెళ్లి చంద్రశేఖర్‌ అన్నారు.

 హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం : బీజేపీ
నార్కట్‌పల్లి: సమావేశంలో మాట్లాడుతున్న వీరెళ్లి చంద్రశేఖర్‌

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం : బీజేపీ

నార్కట్‌పల్లి, మర్రిగూడ, చిట్యాలరూరల్‌, సెప్టెంబరు 15: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయ డంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెళ్లి చంద్రశేఖర్‌ అన్నారు. నార్కట్‌పల్లిలో ఆదివారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి రావడానికి అలవికాని హామీలనిచ్చి వాటిని అమలు చేయడానికి రేవంతరెడ్డి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని విమర్శించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదును విస్తృతం చేయాలని, ప్రతీ బూ తకు కనీసం 40శాతం తగ్గకుండా మండలంలో 16 వేల సభ్యత్వాలను చేర్పించాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల వెంకన్న, నాయకులు పజ్జూరి వెంకట్‌రెడ్డి, కొర్వి శంకర్‌, గణేష్‌, రమేష్‌, సత్తయ్య, రామలింగం, లింగస్వామి, ఉపేందర్‌, సతీష్‌, రమేష్‌, శివశంకర్‌, శివ పాల్గొన్నారు.

మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశం లో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు పాత్లావత రాజేందర్‌నాయక్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కిసాన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యాస అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతీ బూతలో 200 కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని అన్నారు. సమావేశంలో పా ర్టీ ప్రధాన కార్యదర్శి బోయపల్లి రాజుగౌడ్‌, నాయకులు పందుల రాములుగౌడ్‌, వేనేపల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యాక్షుడు సిలివేరు వెంకటేష్‌, చేపల వెంకటేష్‌, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పగిళ్ల లిం గస్వామి, అంబాల రమేష్‌, శోభనబాబు, చల్లం శంకర్‌, సురేష్‌, శ్రీనివాస్‌, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో నిర్వహించిన సమావేశంలో మండల ఇనచార్జి పజ్జూరు వెంకట్‌రెడ్డి మాట్లాడారు. స భ్యత్వ నమోదులో మండలాన్ని అగ్రస్థానంలో నిలపాలని కోరా రు. శ్రీరామలింగేశ్వర స్వామి శక్తి కేంద్రం ఇనచార్జి ఉయ్యాల లింగస్వామి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రా రంభించారు. పీఎం నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి సం క్షేమ పథకాలతో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కా ర్యక్రమంలో నాయకులు మండల వెంకన్న, పొట్లపల్లి నర్సింహ, లింగస్వామి, సతీష్‌, వెంకన్న, అంజన్న, విష్ణు, నర్సింహ, నరేంద్రచారి, అనిల్‌, సత్యనారాయణ, వెంకటేష్‌, దినేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:19 AM