Share News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లవి నాటకాలు: బీజేపీ

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:38 AM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కొత్త నాటకాలు మొదలుపెట్టాయని బీజేపీ ఎమ్మెల్యేలు శంకర్‌, వెంకటరమణారెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లవి నాటకాలు: బీజేపీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కొత్త నాటకాలు మొదలుపెట్టాయని బీజేపీ ఎమ్మెల్యేలు శంకర్‌, వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడుతూ.. ‘కేంద్రంలో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతుంది. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యాయి. వీరి మాటలను ప్రజలు ఎప్పటికీ నమ్మరు.. కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉండి ఏ అభివృద్ధి చేయలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఏం చేయబోదు. ఈ ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను నయవంచనకు గురిచేయడం తప్ప మరొకటి లేదు’ అని విమర్శించారు.

Updated Date - Feb 13 , 2024 | 03:38 AM