ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరగాలి
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:00 AM
ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడుతు న్న ట్లు ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జి ల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సో మవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) :ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడుతు న్న ట్లు ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జి ల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సో మవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలు వురు ఆర్జిదారులతో ఎస్పీ నేరుగా మా ట్లాడి వారి సమస్యలను తెలు సుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మా ట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయా లని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువ చేసే దిశగా పోలీస్ అధికారులు పనిచేయాలన్నారు. ఫిర్యాదు దారులతో మర్యా దగా మాట్లాడి వినతులు స్వీకరించాలన్నారు. ప్రజా సమ స్యలను పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వివరించారు.