Share News

BJP Membership: బీజేపీ సభ్యత్వ నమోదులో తెలంగాణ టాప్‌

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:54 AM

బీజేపీ చేపట్టిన ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది.

BJP Membership: బీజేపీ సభ్యత్వ నమోదులో తెలంగాణ టాప్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): బీజేపీ చేపట్టిన ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది. కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఏపీలో 49,338 మందికి సభ్యత్వం ఇవ్వగా, తెలంగాణలో 1,85,134 మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2,34,472 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తరువాత కర్ణాటకలో అత్యధిక సభ్యత్వ నమోదు జరిగింది. అక్కడ మొత్తం సభ్యత్వాలు 1.82 లక్షలు వచ్చాయని బుధవారం ఒక ప్రకటనలో బీజేపీ తెలిపింది.

Updated Date - Sep 05 , 2024 | 04:54 AM