Alleti Maheshwar Reddy: ఆత్మగౌరవానికి ప్రతీక సెప్టెంబరు 17
ABN , Publish Date - Sep 05 , 2024 | 04:48 AM
సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్రం
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక విమోచన దినోత్సవాన్ని నిర్వహించే అవకాశం కాంగ్రె్‌సకు వచ్చిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గత పాలకులు పట్టించుకోలేదన్నారు. మజ్లి్‌సకు భయపడి నిర్వహించలేదన్నారు.
తెలంగాణ సిద్ధిస్తేనే ఆత్మగౌరవం సాధ్యమని సినిమా డైలాగులు చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక మజ్లి్‌సకు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాణనష్టం జరగడం దురదృష్టకరం అని ఏలేటి పేర్కొన్నారు.