Share News

Kumaram Bheem Asifabad: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ABN , Publish Date - Sep 15 , 2024 | 10:23 PM

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 15: సిర్పూరు నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

 Kumaram Bheem Asifabad:   యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 15: సిర్పూరు నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని యువత కోసం వివిధ కంపెనీలతో మాట్లాడామన్నారు. త్వరలోనే జాబ్‌మేళాలు చేపడతామన్నారు. యువత తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే బాలికలు చదువుకునేందుకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీఎం క్రీడామైదానంలో ఎగ్జిబిషన్‌ పెట్టడం దారుణమన్నారు. ఎస్పీఎం యాజమాన్యం కేవలం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ గ్రౌండులోనే గణనాథుల ప్రదర్శన, బతుకమ్మల ఆటలు ఆడతారన్నారు. యాజమాన్యం వెంటనే ఈ చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో ఉద్యమబాట పడుతామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడు మతఘర్షణలకు తావివ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్‌ హయాంలో జైనూరు లాంటి ఘటనలు జరిగాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 10:23 PM