Kumaram Bheem Asifabad: అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
ABN , Publish Date - Sep 15 , 2024 | 10:25 PM
రెబ్బెన, సెప్టెంబరు 14: మహారాష్ట్రలోని గట్‌చందూర్ నుంచి నిజామాబాద్‌కు పశువులను లారీలో అక్రమంగా తరలిస్తుంగా పుంజుమేరగూడ వద్ద పట్టుకున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
రెబ్బెన, సెప్టెంబరు 14: మహారాష్ట్రలోని గట్‌చందూర్ నుంచి నిజామాబాద్‌కు పశువులను లారీలో అక్రమంగా తరలిస్తుంగా పుంజుమేరగూడ వద్ద పట్టుకున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గట్‌చందూర్ మీదుగా లారీలో పశువులను తరలిస్తున్నట్టు ముందస్తు అందిన సమాచారం మేరకు పుంజుమేర గూడ వద్ద లారీని ఆపాం. లారీలో 20ఎద్దులు, 15ఆవులు ఉన్నా యి. ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు లారీతోపాటు డ్రైవర్ మహ్మద్ అతం, క్లినర్ సయ్యద్ వాహిబ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పట్టుకున్న ఆవులను కాగజ్‌నగరలోని గోశాలకు తరలించామన్నారు.