Kumaram Bheem Asifabad: విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలి
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:10 PM
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. రూంటురీడ్ ఇండియా సంస్థ సౌజన్యంతో ఆసిఫాబాద్ మండలం తుంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్‌లైబ్రరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూంటురీడ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీలో వివిధ రకాల రంగురంగుల 500కథల పుస్తకాలు, పఠనసామగ్రిద్వారా విద్యార్థుల్లో విద్యాసామ ర్థ్యాలు పెం పొందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఈవో ఉదయబాబు, రూంటు రీడ్ రాష్ట్ర మేనేజర్ నరసింహాచారి, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు సుభాష్‌బాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాగునీరు సరఫరా చేయాలి..
వాంకిడి: మండలంలోని పాటగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనోలి కోలాంగూడ గ్రామానికి మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిసరఫరా చేయాలని కోరుతూ సోమ వారం సీపీఎం ఆధ్వర్యంలో అదనపుకలెక్టర్ దీపక్ తివారికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో తాగునీరు వసతిలేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నామని చేతిపంపులు చెడిపోవడంతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీటీడీఏ వైస్‌ప్రెసిడెంట్ పగ్గు, సిడాం ధర్ము, ఆత్రం పోత తదితరులు పాల్గొన్నారు.