Share News

Kumaram Bheem Asifabad : ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:01 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని సెయింట్‌ మేరీ ఉన్నతపాఠశాలలో రెండురోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ మనాక్‌-52 బాలలవైజ్ఞానికప్రదర్శన శుక్రవారం ముగిసింది.

Kumaram Bheem Asifabad :   ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన

- రాష్ట్రస్థాయికి 31ప్రదర్శనల ఎంపిక

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని సెయింట్‌ మేరీ ఉన్నతపాఠశాలలో రెండురోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ మనాక్‌-52 బాలలవైజ్ఞానికప్రదర్శన శుక్రవారం ముగిసింది. మొత్తం358 ప్రదర్శ నలు విద్యార్థులు ప్రదర్శించగా రాష్ట్రస్థాయికి 31ప్రదర్శనలు ఎంపికైనట్లు జిల్లా సైన్స్‌ అధికారి కటకం మధుకర్‌ తెలిపారు. ముగింపు కార్యక్రమానికి డీఈవో యాదయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఏ రంగాల్లో రాణి స్తారో ఆయారంగాల్లో రాణించేలా కృషిచేయాలన్నారు. విద్యార్థుల్లో వైజ్ఞానికతను వెలికితీయడానికి ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. జిల్లాలో రెండు రోజులపాటు వైజ్ఞానికప్రదర్శనలు నిర్వహించడానికి తోడ్పాటు అందించిన ఉపా ధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, ప్రిన్సిపాల్‌ త్రిష్యమ్మ, డీఈవో ప్రభాకర్‌, ఎఫ్‌ఏవోదేవాజీ, ఏసీజీఈ ఉదయ్‌బాబు, ఎంఈఓ సుభాష్‌, ఏసీఎంఓ ఉద్దవ్‌, ధర్మపురి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:01 PM