Kumaram Bheem Asifabad: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ABN , Publish Date - Oct 28 , 2024 | 11:26 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తు లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తారని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తు లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తారని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆసి ఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన గోలెం గంగ చీపురుదుబ్బ గ్రామశివారులో పట్టాభూమిలో వంశపారం పర్యంగా తనకురావాల్సిన వాటాభూమిని ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకు న్నారు. పెంచికలేపట మండలం పోతెపల్లి గ్రామానికి చెందిన అల్లూరి అజయ్‌కుమార్ తనకు కంటిచూపు లేనందున సదరం శిబి రంలో పరీక్షనిర్వహించి ధ్రువపత్రం మంజూరు చేయాలని, కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన రైతులు తమ భూములకు సాగునీరు అందించాలని, వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. కెరమెరి మండలం గోయగాం గ్రామానికి చెందిన పవార్ రాము తనఇంటిపై ఉన్న కరెంటుతీగలు తొలగిం చాలని దరఖాస్తు అంద జేశారు. రెబ్బెన మండలం ఇందిరానగర్‌కు చెందిన నరేష్ సింగరేణి భూసేకర ణలో భూమి పోయిందని తనకు ఉపాధి కల్పించా లని, రాళ్లపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ వంకులం జీపీలో మల్టీపర్పస్ కార్మికుడిగా పనిచేస్తుండగా అన్యాయంగా తొల గించారని తిరిగి నియమించాలని దరఖాస్తు సమర్పించారు. ఆసిఫాబాద్‌పట్టణానికి చెందిన ఓదెలు తన భార్య, కుమారులు దివ్యాంగులు అయినందున పోషణకు ఇబ్బందిగా ఉందని తనకు ఉపాధి కల్పించాలని, రెబ్బెన మండలం తక్కళ్లపల్లికి చెందిన బండపోశం గ్రామశివారు లో పట్టాభూమికి పాసుపుస్తకం అందించాలని, దహెగాంమండలం దిగిడ,రాంపూర్ గ్రామానికి చెందిన మారుబాయి పట్టాభూమి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దరఖాస్తు అందజేశారు.