Share News

Kumaram Bheem Asifabad: రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్‌

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:06 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పదేళ్లబంగారు పాలనను పదినెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు.

Kumaram Bheem Asifabad:   రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్‌

- మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పదేళ్లబంగారు పాలనను పదినెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన దీక్షదివస్‌ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి ఆయన హాజరయ్యారు. చిల్డ్రన్స్‌ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద, బస్టాండు సమీపంలోని తెలంగాణ తల్లివిగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సంపూర్ణ తెలంగాణ సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కారని పేర్కొ న్నారు. నవంబరు 29 సువర్ణ అక్షరా లతో రాయబడిన రోజని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఎవరికీ భయపడేది లేదని రానున్న స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతోపాటు ఎంపీపీ, జడ్పీచైర్మన్‌ పదవులను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుంద న్నారు. దీక్షాదివస్‌ సందర్భంగా ఏర్పాటుచేసిన ధూంధాం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో నాయకులు సరస్వతి, కలాం, వెంకన్న, సలీం, అలీబీన్‌ అహ్మద్‌, యాదవరావు, జగదీష్‌, శ్రీనివాసరావు, రవి, ధ్రుపతాబాయి, సంగీత, ఉమ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:06 PM