రూ.6.50లక్షల విలువైన రోల్ రూ.లక్షకే విక్రయం
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:49 AM
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల ప రిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన (వైటీపీఎ్‌స)లో 28 అల్యూమినియం రోల్స్ చోరీ చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ.6.50లక్షల విలువైన రోల్ రూ.లక్షకే విక్రయం
వైటీపీఎస్‌లో 28 రోల్స్ చోరీ
ఐదుగురు నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు
మిర్యాలగూడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండల ప రిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన (వైటీపీఎ్‌స)లో 28 అల్యూమినియం రోల్స్ చోరీ చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మిర్యా లగూడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజ శేఖరరాజు కేసు వివరాలు వెల్లడించారు. గత నెలలో వైటీపీఎ్‌సలో జరిగిన కాపర్ దొంగతనం కేసులో పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ రాష్ట్రానికి చెందిన హైడ్రా సూపర్‌వైజర్లు రంజితకుమార్‌వర్మ, అభయ్ ప్రతాప్ మౌర్యలను అదుపులోకి తీసుకుని విచారించగా, అల్యూమినియం రోల్స్ చోరీ నిందితుల గురించి వెల్లడించారు. వైటీపీఎస్ నిర్మాణ సంస్థ బీహెచఈఎల్‌కు చెందిన సబ్ కాంట్రాక్టు కంపెనీ దుర్గా క్రేన సర్వీసెస్ సంస్థ అల్యూమినియం రోల్స్ దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మిర్యాలగూడకు చెందిన షేక్ మున్నీర్, దామరచర్లకు చెందిన కంబాల అశోక్, మిర్యాలగూడ మండలం ఇర్కిగూడేనికి చెందిన గోపిశెట్టి అజయ్, పసుపులేటి కోటేశ్వరావు, సెక్యూరిటీగార్డు పుల్లయ్య సాయంతో చోరికిపాల్పడినట్లు గుర్తించారు. బీహెచఈఎల్ యార్డు పరిసరాల్లో స్టోర్ యార్డులోని అల్యూమినియం రోల్స్‌ను హైడ్రాల ద్వారా కిరాయికి తెచ్చిన వాహనాల్లోకి ఎక్కించి హైదరాబాద్‌లోని పాత ఇనుము వ్యాపారులు షేక్ షర్పోద్దీన, ఖైరొద్దీన, ముజీబ్, వహీద్‌అలీ అనే వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలిందన్నారు. 28 అల్యూమినియం రోల్స్ చోరీ అయినట్లు కంపెనీ నిర్వాహకులు గుర్తించారని తెలిపారు. కాగా ఒక్కో రోల్స్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6.50లక్షలు కాగా ఒక్కో రోల్‌ను పాత ఇనుప కొట్టులో రూ.లక్షకే విక్రయించినట్లు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితుల అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 సెల్‌ఫోన్లు, రూ.15,35,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ వీరబాబు, సీసీఎస్ సీఐ జితేందర్‌రెడ్డి, ఏఎ స్‌ఐ అప్జల్ అలీ తదితరులు పాల్గొన్నారు.