Share News

రాజీవ్‌ రహదారిపై ఫ్లై ఓవర్‌ నిర్మించాలి

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:59 PM

డీఈఈకి గ్రామస్థుల వినతి

 రాజీవ్‌ రహదారిపై ఫ్లై ఓవర్‌ నిర్మించాలి
వినతిపత్రం అందజేస్తున్న రంగధాంపల్లి గ్రామస్థులు

సిద్దిపేట అర్బన్‌,అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణంతో ఇళ్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్నామని, రంగధాంపల్లి రాజీవ్‌ రహదారిపై ఫ్లై ఓవర్‌ నిర్మించాలని రంగధాంపల్లి గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. రంగధాంపల్లి రాజీవ్‌ రహదారి నిర్మాణ పనులను అడ్డుకుని ఆదివారం డీఈఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. రాజీవ్‌ రహదారి నిర్మాణంతో ఇళ్లు, భూములు కోల్పోతున్నామని, ఫ్లై ఓవర్‌ నిర్మించే వరకు నిర్మాణాలను కూల్చవద్దని కోరారు. జీవనాధారమైన వ్యవసాయ భూములు కోల్పోవడం వల్ల తమకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తి చేశారు. తమ పొట్ట కొట్టొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు వంగ నాగిరెడ్డి, తిరుమలరెడ్డి, ముత్యాల కనకయ్య, శ్రీనివా్‌సగౌడ్‌, వెంకటస్వామి, రజనీకాంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, దుర్గారెడ్డి, రాజు, రంగం, ఆంజనేయులు, కనకారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 11:59 PM