Share News

మేం పెద్ద తప్పు చేశాం..

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:35 AM

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు తొలి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని అంపైర్‌ పొరపాటు నిర్ణయం వల్లనే సాధించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2019లో అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసిన ఆ ఫైనల్‌....

మేం పెద్ద తప్పు చేశాం..

2019 వరల్డ్‌కప్‌ ఫైనల్‌పై మాజీ అంపైర్‌ ఎరాస్మస్‌

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు తొలి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని అంపైర్‌ పొరపాటు నిర్ణయం వల్లనే సాధించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2019లో అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసిన ఆ ఫైనల్‌.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత అరుదైన మ్యాచ్‌గా నిలిచింది. కివీస్‌తో ఆ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియడంతో, ఎక్కువ బౌండరీల కారణంగా ఇంగ్లండ్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో తాము పొరపాటుకు పాల్పడినట్టు అప్పటి అంపైర్‌ ఎరాస్మస్‌ పేర్కొన్నాడు. 50వ ఓవర్‌ నాలుగో బంతికి గప్టిల్‌ విసిరిన త్రో రన్‌తీస్తున్న స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. అప్పటికే బ్యాటర్లు రెండు పరుగులు పూర్తి చేయగా.. ఈ ఫోర్‌ కలిపి ఫీల్డ్‌ అంపైర్లు ఆరు పరుగులుగా ప్రకటించారు. దీంతో సమీకరణం 2 బంతుల్లో మూడు రన్స్‌కు మారగా ఇంగ్లండ్‌ రెండు పరుగులే చేయడంతో టైగా ముగిసింది. కానీ ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఇక్కడ ఐదు పరుగులే రావాలి. ఎందుకంటే.. గప్టిల్‌ బంతి విసిరే సమయానికి బ్యాటర్లు రెండో పరుగు కోసం ఒకరినొకరు క్రాస్‌ చేసుకోలేదు. మర్నాడు ఉదయం హోటల్లో మరో అంపైర్‌ ధర్మసేన తాము చేసిన అదిపెద్ద పొరపాటు గురించి చెప్పాడని ఎరాస్మస్‌ గుర్తు చేసుకున్నాడు. కానీ మైదానంలో మాత్రం బ్యాటర్ల పరుగు గమనించక, తామిద్దరం ఆరు పరుగులే ఇవ్వాలనే విధంగా మాట్లాడుకున్నామని తెలిపాడు.

Updated Date - Apr 03 , 2024 | 01:35 AM