వాషింగ్టన్‌కు పిలుపు
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:34 AM
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో 8 వికెట్లతో ఓడిన నేపథ్యంలో జాతీయ సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కివీ్‌సతో జరిగే చివరి రెండు టెస్ట్‌లకు
చివరి రెండు టెస్టులకు ఎంపిక
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో 8 వికెట్లతో ఓడిన నేపథ్యంలో జాతీయ సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కివీ్‌సతో జరిగే చివరి రెండు టెస్ట్‌లకు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అదనంగా చోటు కల్పించారు. దాంతో జట్టు సభ్యుల సంఖ్య 16కు చేరింది. రెండో టెస్ట్ ఈనెల 24 నుంచి పుణెలో జరగనుంది. ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు సుందర్ 152 రన్స్ చేశాడు.