విరాట్ దూరం కావడం సిరీ్‌సకే అవమానం
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:32 AM
విరాట్ కోహ్లీ దూరం కావడంతో.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు...
కేప్‌టౌన్: విరాట్ కోహ్లీ దూరం కావడంతో.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్టుల సిరీ్‌సలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి రెండు మ్యాచ్‌లు ఎంతో రసవత్తరంగా జరిగాయన్నాడు. ‘ఈ రెండుజట్ల మధ్య నేను చూసిన సిరీ్‌సల్లో ఇదే ఎంతో పోటాపోటీగా సాగుతోంది. రెండో టెస్టులో నెగ్గిన భారత్ సిరీస్ సమం చేసినా.. ఇంగ్లండ్ దూకుడైన ఆటతో అదరగొడుతోంది. కానీ, ఈసారి కోహ్లీ లేకపోవడం సిరీస్, క్రికెట్‌కు అవమానమ’ని బ్రాడ్ అన్నాడు.