Share News

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:15 AM

బుచ్చిబాబు ఇన్విటేషన్‌ ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఏడేళ్ల తర్వాత విజేతగా నిలిచింది. తమిళనాడులోని దిండిగల్‌లో బుధవారం ముగిసిన ఫైనల్లో...

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

  • ఏడేళ్ల తర్వాత ట్రోఫీ కైవసం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బుచ్చిబాబు ఇన్విటేషన్‌ ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఏడేళ్ల తర్వాత విజేతగా నిలిచింది. తమిళనాడులోని దిండిగల్‌లో బుధవారం ముగిసిన ఫైనల్లో చత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్‌ 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ బ్యాటర్లు రోహిత్‌ రాయుడు సెంచరీ (155)తో, అభిరథ్‌ (85 పరుగులు), రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (68 పరుగులు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ 8, అనికేత్‌ రెడ్డి 6 వికెట్లు తీసి హైదరాబాద్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు రోహిత్‌కు లభించింది. అంతకుముందు హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 417, చత్తీస్‌గఢ్‌ 181కు, రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 281, చత్తీస్‌గఢ్‌ 274కు ఆలౌటయ్యాయి.

Updated Date - Sep 12 , 2024 | 03:15 AM