స్వీప్ చేశారు
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:49 AM
ప్రపంచ టెస్టుచాంపియన్‌షి్‌పలో తామెందుకు అగ్రస్థానంలో కొనసాగుతున్నామో.. టీమిండియా మరోసారి చాటిచెప్పింది. బంగ్లాదేశ్‌తో అత్యంత ఆసక్తికరంగా సాగిన రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. అలాగే సిరీ్‌సను...
2-0తో సిరీస్ భారత్‌దే
రెండో టెస్టులో ఘనవిజయం
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 146 ఆలౌట్
బుమ్రా, జడేజా, అశ్విన్‌లకు మూడేసి వికెట్లు
టీమిండియా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది. ఈ తక్కువ సమయంలోనే ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగి మరో సెషనున్నర సమయం ఉండగానే టెస్టు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పేసర్లు, స్పిన్నర్లనే తేడా లేకుండా కలిసికట్టుగా భారత బౌలింగ్ దళం విరుచుకుపడడంతో ఈ అరుదైన ఘట్టాన్ని సాధించింది. జట్టు ఖాతాలో ఇది వరుసగా 18వ స్వదేశీ సిరీస్ విజయం కావడం మరో విశేషం.
కాన్పూర్: ప్రపంచ టెస్టుచాంపియన్‌షి్‌పలో తామెందుకు అగ్రస్థానంలో కొనసాగుతున్నామో.. టీమిండియా మరోసారి చాటిచెప్పింది. బంగ్లాదేశ్‌తో అత్యంత ఆసక్తికరంగా సాగిన రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. అలాగే సిరీ్‌సను 2-0తో దక్కించుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో. కానీ కొత్త కోచ్ గంభీర్ దూకుడు వ్యూహానికి అనుగుణంగా రోహిత్ సేన బౌలింగ్.. బ్యాటింగ్‌లో తమ పవర్ ఏంటో చూపింది. కేవలం ఆరు సెషన్లలోనే అనుకున్నది సాధించగలిగింది. చివరి రోజు మంగళవారం బంతితో మరింతగా చెలరేగి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. పేసర్ బుమ్రాతో పాటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా మూడేసి వికెట్లతో తడాఖా చూపడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. షాద్‌మన్ (50), ముష్ఫికర్ (37) మాత్రమే రాణించారు. ఆ తర్వాత 95 పరుగుల స్వల్ప ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ 17.2 ఓవర్లలో 98/3 స్కోరు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్ (51), విరాట్ (29 నాటౌట్) ఆకట్టుకున్నారు. మిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 233 రన్స్ చేయగా, భారత్ 285/9 స్కోరు దగ్గర డిక్లేర్‌చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా జైస్వాల్, ప్లేయర్ ఆఫ్ ద సిరీ్‌సగా అశ్విన్ (11 వికెట్లు+114 పరుగులు) నిలిచారు.
బౌలింగ్ ఉచ్చులో..: ఓవర్‌నైట్ స్కోరు 26/2తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాను మొదట అశ్విన్ దెబ్బకొట్టగా.. మిడిలార్డర్‌లో జడేజా వరుస ఓవర్లలో బిత్తరపోయేలా చేశాడు. ఇక టెయిలెండర్లను బుమ్రా తన పదునైన బంతులతో నిలువనీయలేదు. దీంతో ఈ జట్టు కనీసం ఓ సెషన్‌ను కూడా పూర్తి చేయలేకపోయింది. చివరి రోజు బంగ్లా ఆరంభంలోనే మోమినుల్ (2) వికెట్ కోల్పోయింది. కానీ ఓపెనర్ షాద్‌మన్ మాత్రం పోరాటం కనబరచాడు. అర్ధసెంచరీ సాధించిన తను కెప్టెన్ షంటో (19)తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. బౌలర్లను విసిగిస్తున్న ఈ జోడీని జడేజా విడదీశాడు. షంటో అనవసరంగా రివర్స్ స్వీప్‌నకు వెళ్లి బౌల్డయ్యాడు. ఇక్కడి నుంచి బంగ్లా వికెట్ల పతనం వేగంగా సాగింది. ఆ వెంటనే షాద్‌మన్‌ను ఆకాశ్ అవుట్ చేశాడు. అటు వరుస ఓవర్లలో లిట్టన్ (1), షకీబ్ (0)లను జడేజా వెనక్కి పంపడంతో స్కోరు 91/4 నుంచి 94/7కి పడిపోయింది. ఆ తర్వాత బుమ్రా మిగిలిన వికెట్లను పడగొట్టాడు. ఓపిగ్గా ఆడుతున్న ముష్ఫికర్ సరిగ్గా లంచ్ సెషన్ ఆఖరి బంతికి భారీ షాట్‌కు వెళ్లి బౌల్డ్ కావడంతో వీరి ఇన్నింగ్స్ ముగిసింది.
జైస్వాల్ హాఫ్ సెంచరీ: 95 పరుగుల స్వల్ప ఛేదనను భారత్ సునాయాసంగా ముగించింది. ఎప్పటిలాగే ఓపెనర్ జైస్వాల్ మరో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఐదు ఓవర్లలోనే కెప్టెన్ రోహిత్ (8), గిల్ (6) వెనుదిరిగినా యశస్వీ తన సహజశైలిలోనే చెలరేగాడు. అటు విరాట్ కూడా కచ్చితమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. 43 బంతుల్లోనే జైస్వాల్ వరుసగా రెండో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. బౌండరీతో మ్యాచ్‌ను ముగిద్దామనుకున్న జైస్వాల్ క్యాచ్ అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పంత్ (4 నాటౌట్) ఫోర్‌తో రెండో సెషన్‌లోపే మ్యాచ్ ముగిసింది.
స్కోరుబోర్డు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 233; భారత్ తొలి ఇన్నింగ్స్: 285/9 డిక్లేర్;
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్‌మన్ (సి) జైస్వాల్ (బి) ఆకాశ్ 50; జకీర్ (ఎల్బీ)అశ్విన్ 10; హసన్ (బి) అశ్విన్ 4; మోమినుల్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 2; షంటో(బి) జడేజా 19; ముష్ఫికర్ (బి) బుమ్రా 37; లిట్టన్ (సి) పంత్ (బి) జడేజా 1; షకీబ్(సి అండ్ బి) జడేజా 0; మిరాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 9; తైజుల్ (ఎల్బీ) బుమ్రా 0;ఖాలెద్ (నాటౌట్)5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 47 ఓవర్లలో 146 ఆలౌట్. వికెట్ల పతనం: 1-18, 2-26, 3-36, 4-91, 5-93, 6-94, 7-94, 8-118, 9-130;బౌలింగ్: బుమ్రా 10-5-17-3; అశ్విన్ 15-3-50-3; ఆకాశ్ 8-3-20-1; సిరాజ్ 4-0-19-0; జడేజా 10-2-34-3.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) హసన్ (బి) మిరాజ్ 8; జైస్వాల్ (సి) షకీబ్ (బి) తైజుల్ 51; గిల్ (ఎల్బీ) మిరాజ్ 6; విరాట్ (నాటౌట్) 29; పంత్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 17.2 ఓవర్లలో 98/3. వికెట్ల పతనం: 1-18, 2-34, 3-92. బౌలింగ్: మిరాజ్ 9-0-44-2; షకీబ్ 3-0-18-0; తైజుల్ 5.2-0-36-
1
అతిపిన్న వయస్సులోనే (22) ఓ క్యాలెండర్ ఏడాదిలో ఎక్కువ పరుగులు (929) చేసిన భారత బ్యాటర్‌గా జైస్వాల్. గవాస్కర్ (918)ను అధిగమించాడు.
టెస్టుల్లో అత్యధిక రన్‌రేట్ (రెండు ఇన్నింగ్స్ కలిపి 7.36) నమోదు చేసిన జట్టుగా భారత్.
2
అతి తక్కువ బంతుల (281)ను ఎదుర్కొని టెస్టు విజయం సాధించిన రెండో టీమ్‌గా భారత్. ఇంగ్లండ్ (276) ముందుంది.
టెస్టుల్లో ఎక్కువ విజయాలు (180) సాధించిన నాలుగో జట్టుగా భారత్. ఆస్ట్రేలియా (414) టాప్‌లో ఉంది.
4
మూడురోజుల ఆట దాదాపుగా వర్షంతో తుడిచిపెట్టుకు పోయిన వేళ.. మిగిలిన రెండు రోజుల్లో ఫలితం గురించి ఆలోచించగలమా?