Share News

రికీ శతకబాదినా..

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:19 AM

ఇండియా ‘డి’ బ్యాటర్‌ రికీ భుయ్‌ (113) శతకం బాదినా తమ జట్టు ఓటమిని అడ్డుకోలేకపోయాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. దీంతో దులీప్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం ముగిసిన...

రికీ శతకబాదినా..

చిత్తుగా ఓడిన ఇండియా ‘డి’

ఇండియా ‘ఎ’దే విజయం

అనంతపురం క్లాక్‌టవర్‌ (ఆంధ్రజ్యోతి) : ఇండియా ‘డి’ బ్యాటర్‌ రికీ భుయ్‌ (113) శతకం బాదినా తమ జట్టు ఓటమిని అడ్డుకోలేకపోయాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. దీంతో దులీప్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’ 186 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఇండియా ‘ఎ’ 6 పాయింట్లతో టైటిల్‌ రేసులో ఉండగా, వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ఇండియా ‘డి’ పోటీ నుంచి వైదొలిగింది. 488 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇండియా ‘డి’ 301 పరుగుల వద్ద ఆలౌటైంది. తనుష్‌ కోటియన్‌కు నాలుగు, ములానికి మూడు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ‘ఎ’ 290, ఇండియా ‘డి’ 183 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా ‘ఎ’ 380/3 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.


అన్షుల్‌కు 8 వికెట్లు..: ఇండియా ‘సి‘ యువ పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. దీంతో ఇండియా ‘బి’ రెండో ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్‌ (157 నాటౌట్‌) అజేయ శతకంతో నిలిచాడు. ఆ తర్వాత ఇండియా ‘సి’ రెండో ఇన్నింగ్స్‌లో 128/4 వద్ద డిక్లేర్‌ చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (62), రజత్‌ పటీదార్‌ (42) రాణించారు. అయితే చివరి సెషన్‌ ఆట ఉన్నప్పటికీ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగులు చేసిన ఇండియా ‘సి’కి 193 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో మూడు పాయింట్లు దక్కించుకున్న ఈ జట్టు ప్రస్తుతం టేబుల్‌ టాపర్‌ (9)గా ఉంది.

Updated Date - Sep 16 , 2024 | 05:19 AM