గిల్‌కు విశ్రాంతి!
ABN , Publish Date - Sep 16 , 2024 | 05:15 AM
బంగ్లాదేశ్‌తో జరుగబోయే మూడు టీ20ల సిరీ్‌సకు ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. త్వరలో కివీ్‌సతో జరిగే టెస్టు సిరీస్ కోసం పని ఒత్తిడి కారణంగా...
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరుగబోయే మూడు టీ20ల సిరీ్‌సకు ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. త్వరలో కివీ్‌సతో జరిగే టెస్టు సిరీస్ కోసం పని ఒత్తిడి కారణంగా గిల్‌తో పాటు పలువురు ఆటగాళ్లను కూడా తప్పించనున్నట్టు సమాచారం. టెస్టు ఫార్మాట్‌లో వన్‌డౌన్ బ్యాటర్‌గా గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో జరుగబోయే పది టెస్టుల్లోనూ అతడిని ఆడించాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది.