మూడో టెస్టుకు రాహుల్ దూరం
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:36 AM
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు ఝలక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలి గాయంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో తొలిసారిగా దేవ్‌దత్...
దేవ్‌దత్‌కు చోటు
రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు ఝలక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలి గాయంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో తొలిసారిగా దేవ్‌దత్ పడిక్కళ్‌ను జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ తొడ కండరాల నొప్పితో రెండో టెస్టులోనూ ఆడలేకపోయాడు. ఇటీవల మిగిలిన మూడు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో రాహుల్ పేరును చేర్చినా.. అతడి ఫిట్‌నెస్ బట్టి నిర్ణయం తీసుకుంటామని సెలెక్టర్లు తెలిపారు. దీనికి తగ్గట్టుగానే ఫిట్‌నెస్ టెస్టులో రాహుల్ విఫలమైనట్టు బోర్డు మెడికల్ టీమ్ తెలిపింది. వారం తర్వాత రాహుల్‌కు మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీ్‌సకు దూరమవగా.. తాజాగా రాహుల్ గైర్హాజరీ ప్రభావం బ్యాటింగ్ ఆర్డర్‌పై పడనుంది. ఇక, తొడకండరాల నొప్పితోనే బాధపడుతున్న ఆల్‌రౌండర్ జడేజా ఫిట్‌నెస్ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత రంజీ ట్రోఫీలో కర్ణాటక బ్యాటర్ పడిక్కళ్ పరుగుల వరద పారిస్తున్నాడు. తానాడిన నాలుగు మ్యాచుల్లో 3 సెంచరీలతో అతను 556 పరుగులు సాధించడం విశేషం.
భరత్ స్థానంలో ధ్రువ్?: ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో విఫలమైన వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై వేటు పడేలా ఉంది. ఈనెల 15 నుంచి రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టులో అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌కు బెర్త్ దక్కవచ్చు. కారు ప్రమాదంతో రిషభ్ పంత్ జట్టుకు దూరమైనప్పటి నుంచి భరత్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. అయితే కీపింగ్ విషయంలో తను చురుగ్గానే ఉంటున్నా బ్యాటింగ్ వైఫల్యం మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఆడిన ఏడు టెస్టుల్లో కనీసం అర్ధసెంచరీ సాధించలేకపోగా సగటు 20.09గా ఉంది. దీంతో యువ కీపర్ జురెల్‌ను ప్రోత్సహించే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.