Share News

రజతమైనా అద్భుతమే..

ABN , Publish Date - Aug 10 , 2024 | 06:31 AM

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను ప్రధాని మోదీ ప్రశంసించారు. గురువారం రాత్రి జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ రజత పతకం

రజతమైనా అద్భుతమే..

భారత స్టార్‌తో మోదీ ఫోన్‌ సంభాషణ

న్యూఢిల్లీ: స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను ప్రధాని మోదీ ప్రశంసించారు. గురువారం రాత్రి జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ రజత పతకం అందుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు నీరజ్‌కు శుక్రవారంనాడు ప్రధాని ఫోన్‌ చేసి నాలుగు నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. గాయం కారణంగా తాను పసిడి పతకాన్ని నిలబెట్టుకోలేకపోయానని ప్రధానికి ఈ సందర్భంగా చోప్రా తెలిపాడు. దాంతో.. స్వర్ణ పతకం సాధించలేదని బాధపడొద్దని అతడికి సూచించారు. ‘గాయం ఉన్నా రజత పతకం కైవసం చేసుకోవడం అద్భుతం. నీ ఫీట్‌ యువతరాన్ని అబ్బురపరుస్తుంది. దేశం కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తిని వారిలో రగులుస్తుంది’ అని నీరజ్‌తో మోదీ అన్నారు. గాయాన్ని అధిగమించి ముందుకు ఎలా సాగాలో తర్వాత వివరంగా చర్చిద్దామని చోప్రాతో మోదీ అన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 06:31 AM