ఫిఫా ర్యాంకుల్లో మన స్థానం 117
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:28 AM
ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన.. భారత ఫుట్‌బాల్ జట్టు ర్యాంకింగ్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. తాజాగా విడుదల చేసిన ఫిఫా ర్యాంకుల జాబితాలో భారత్ 15 స్థానాలు దిగజారి 117వ స్థానం...
15 స్థానాలు కిందికి...
న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన.. భారత ఫుట్‌బాల్ జట్టు ర్యాంకింగ్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. తాజాగా విడుదల చేసిన ఫిఫా ర్యాంకుల జాబితాలో భారత్ 15 స్థానాలు దిగజారి 117వ స్థానంలో నిలిచింది. 2017 తర్వాత టీమిండియా ర్యాంక్ ఇంతగా పతనం కావడం ఇదే తొలిసారి. ఆసియాక్‌ప లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ భారత్ ఓటములను చవిచూసింది. అంతేకాకుండా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. దీంతో మొత్తం 35.57 పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది.