Share News

ఖిలారి.. కేక

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:36 AM

పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 విభాగంలో వరల్డ్‌ చాంపియన్‌ సచిన్‌ సర్జేరావ్‌ ఖిలారి రజత పతకం కొల్లగొట్టాడు. 16.32 మీటర్ల ఆసియా రికార్డు దూరం గుండును విసిరిన సచిన్‌ రెండో స్థానం చేజిక్కించుకున్నాడు. 34 ఏళ్ల ఖిలారి తన రెండో...

ఖిలారి.. కేక

పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 విభాగంలో వరల్డ్‌ చాంపియన్‌ సచిన్‌ సర్జేరావ్‌ ఖిలారి రజత పతకం కొల్లగొట్టాడు. 16.32 మీటర్ల ఆసియా రికార్డు దూరం గుండును విసిరిన సచిన్‌ రెండో స్థానం చేజిక్కించుకున్నాడు. 34 ఏళ్ల ఖిలారి తన రెండో ప్రయత్నంలో ఈ రికార్డు దూరాన్ని నమోదు చేశాడు. ఈక్రమంలో తన పేరిటే ఉన్న 16.30 మీటర్ల ఆసియా రికార్డును బద్దలు కొట్టాడు. కెనడాకు చెందిన గ్రెగ్‌ స్టివార్ట్‌ (16.38మీ.) టోక్యోలో గెలిచిన తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక..లుకా బకోవిక్‌ (క్రొయేషియా, 16.27మీ.) కాంస్యం గెలుపొందారు. మరో ఇద్దరు భారత అథ్లెట్లు మహ్మద్‌ యాసిర్‌ (14.21మీ.) 8, రోహిత్‌ (14.10మీ.) 9వ స్థానంలో నిలిచారు. హర్విందర్‌ స్వర్ణం, ఖిలారి రజతంతో ఈ క్రీడల్లో భారత్‌ మొత్తం పతకాల సంఖ్య 22కి చేరింది. ఇందులో 4 పసిడి పతకాలున్నాయి.

Updated Date - Sep 05 , 2024 | 02:36 AM