Share News

వ్రితికి స్వర్ణం, సంపత్‌కు కాంస్యం

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:20 AM

జాతీయ సీనియర్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు రాష్ట్రాల స్విమ్మర్లు వ్రితి అగర్వాల్‌ స్వర్ణం, సంపత్‌కుమార్‌ యాదవ్‌ కాంస్య పతకాలు...

వ్రితికి స్వర్ణం, సంపత్‌కు కాంస్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు రాష్ట్రాల స్విమ్మర్లు వ్రితి అగర్వాల్‌ స్వర్ణం, సంపత్‌కుమార్‌ యాదవ్‌ కాంస్య పతకాలు కొల్లగొట్టారు. మంగళూరులో బుధవారం జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన వ్రితి 17 నిమిషాల 45.63 సెకన్లలో రేసు ముగించి విజేత గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంపత్‌ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో 8 నిమిషాల 28.35 సెకన్లలో రేసు ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

Updated Date - Sep 12 , 2024 | 03:20 AM