Share News

విశాఖలో నేడు కేకేఆర్‌తో ఢిల్లీ సై

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:41 AM

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయ ఢంకా మోగించి, ఊపులో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరుకు రిషభ్‌ పంత్‌ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ సై అంటోంది. ఈ సీజన్‌లో విశాఖకు కేటాయించిన మ్యాచ్‌ల్లో...

విశాఖలో నేడు కేకేఆర్‌తో ఢిల్లీ సై

విశాఖపట్నం (స్పోర్ట్ప్‌): ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయ ఢంకా మోగించి, ఊపులో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరుకు రిషభ్‌ పంత్‌ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ సై అంటోంది. ఈ సీజన్‌లో విశాఖకు కేటాయించిన మ్యాచ్‌ల్లో రెండో, ఆఖరి పోరు ఇది. వరుస పరాజయాలకు స్వస్తి చెబుతూ, గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సీఎస్కేకు షాకిచ్చిన ఢిల్లీ, ఈసారి జోష్‌లో ఉన్న కేకేఆర్‌ స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్‌లో 33 సార్లు తలపడగా, చెరో 16 సార్లు గెలిచాయి. గత మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, కెప్టెన్‌ పంత్‌ అర్ధ సెంచరీలతో చెలరేగడం, ఆ జట్టు పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ కీలక సమయాల్లో చెలరేగడం ఆ జట్టుకు సానుకూలాంశం. మరోవైపు కేకేఆర్‌ ఆల్‌రౌండర్లు ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌ ఫామ్‌లోకి రావడం, యువ క్రికెటర్లు అంచనాలకు తగ్గట్టు రాణిస్తుండడం ఆ జట్టుకు బలంగా మారింది. విశాఖ పిచ్‌ బ్యాటర్లకు అనుకూలం, మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా.

Updated Date - Apr 03 , 2024 | 01:41 AM