పరాజయం పరిపూర్ణం
ABN , Publish Date - Sep 16 , 2024 | 05:02 AM
డేవిస్ కప్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత్ చేతులెత్తేసింది. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-1లో భాగంగా శనివారం స్వీడన్‌తో ముగిసిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో...
డేవి్‌సక్‌పలో స్వీడన్ చేతిలో భారత్ ఓటమి
స్టాక్‌హోమ్: డేవిస్ కప్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత్ చేతులెత్తేసింది. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-1లో భాగంగా శనివారం స్వీడన్‌తో ముగిసిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ ఆదివారం జరిగిన నిర్ణయాత్మక డబుల్స్ పోరులోను చతికిలపడింది. దీంతో స్వీడన్ 3-0తో విజేతగా నిలిచింది. డేవి్‌సక్‌పలో భారత్‌పై స్వీడన్ గెలవడం ఇది ఆరోసారి. డబుల్స్ మ్యాచ్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రామ్‌కుమార్ రామనాథన్-శ్రీరామ్ బాలాజీ ద్వయం 3-6, 4-6తో ఆండ్రీ గోరాన్సన్-ఫిలి్‌ప బెర్జివి చేతిలో ఓటమి పాలైంది.