Share News

వారి వల్లే..

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:32 AM

పారిస్‌ ఒలింపిక్స్‌ పతక విజేతలను భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తరపున ఇప్పటి వరకు సన్మానించలేకపోయామని అధ్యక్షురాలు పీటీ ఉష ఆవేదన వ్యక్తంజేసింది...

వారి వల్లే..

ఐఓఏ చీఫ్‌ పీటీ ఉష

పారిస్‌ విజేతలను సన్మానించలేదు

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ పతక విజేతలను భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తరపున ఇప్పటి వరకు సన్మానించలేకపోయామని అధ్యక్షురాలు పీటీ ఉష ఆవేదన వ్యక్తంజేసింది. ఇందుకు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు సహకరించకపోవడమే కారణమని ధ్వజమెత్తింది. అంతేకాదు పారిస్‌ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల సన్నద్ధతకు ఉద్దేశించిన నిధులను విడుదల చేయకుండా ఫైనాన్స్‌ కమిటీ అడ్డుకుందని ఆరోపించింది. పారిస్‌ క్రీడల్లో భారత్‌ 6 పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ‘పారిస్‌ వెళ్లే ఒక్కో అథ్లెట్‌కు రూ. రెండు లక్షలు, వారి కోచ్‌ ఒక్కొక్కరికీ రూ. లక్ష ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక కమిటీ అడ్డుకుంది’ అని ఆమె వెల్లడించింది. ఇందుకు ఐఓఏ కోశాధికారి సహదేవ్‌ యాదవే కారణమని ఆరోపించింది.

Updated Date - Oct 01 , 2024 | 04:32 AM