దృష్టంతా రింకూ, అయ్యర్‌పైనే
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:10 AM
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లు గురువారం నుంచి పూర్తిగా అనంతపురంలో జరగనున్నాయి. ఇండియా-ఎతో ఇండియా-డి, మరో మ్యాచ్‌లో ఇండియా-బితో ఇండియా-సి...
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ నేటినుంచి
అనంతపురం క్లాక్‌టవర్ (ఆంధ్రజ్యోతి) : దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లు గురువారం నుంచి పూర్తిగా అనంతపురంలో జరగనున్నాయి. ఇండియా-ఎతో ఇండియా-డి, మరో మ్యాచ్‌లో ఇండియా-బితో ఇండియా-సి ఆడనున్నాయి. తొలి రౌండ్‌లో స్టార్ ఆటగాళ్లతో కళకళలాడినా.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు ఎంపికైన వారిని ఆయా జట్లు రిలీజ్ చేశాయి. దీంతో జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేక పోయిన రింకూ సింగ్ లాంటి ప్లేయర్లు టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారారు. గిల్ కూడా వెళ్లిపోవడంతో ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఇండియా-ఎ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇండియా-డి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రజత్ పటీదార్, పేసర్ నవ్‌దీప్ సైనీ, కేఎస్ భరత్‌లు అదిరే ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ఇదో సువర్ణావకాశం.