Viral Video: నడిరోడ్డుపై టవల్ కట్టుకుని యువతి హల్‌చల్.. షాకైన ముంబై వాసులు.. ఆ తర్వాతేం జరిగిందంటే..!
ABN , Publish Date - Aug 03 , 2024 | 07:06 PM
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం, వ్యూస్, లైక్స్ కోసం నేటి యువతి ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. అబ్బాయిలు ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే, అమ్మాయిలు బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం, వ్యూస్, లైక్స్ కోసం నేటి యువత ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. అబ్బాయిలు ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే, అమ్మాయిలు బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ముంబై (Mumbai)లో ఓ మోడల్ పట్టపగులు, నడిరోడ్డుపై వేసిన వేషాలకు అక్కడున్న వారు షాకయ్యారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
thankgod_itsfashion అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ అయిన తనుమితా ఘోష్ (Tanumita Ghosh) ముంబై రోడ్లపై తన అందాలను ప్రదర్శించింది. ఓ పింక్ టవల్ వేసుకుని రోడ్డుపై వాకింగ్ చేసింది. ఆమెను ఆ అవతారంలో చూసిన వారందరూ షాకయ్యారు. బిజీగా ఉన్న రోడ్డుపై బస్టాప్ నుంచి సమీపంలోని హోటల్‌కు టవల్ (Towel)తోనే నడుచుకుంటూ వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత ఆ టవల్‌ను తీసి పక్కన పడేసింది. లోపల ఓ చిట్టి పొట్టి డ్రెస్ ఉంది. ఓ ఫ్యాషన్ షోలో భాగంగా గతంలో ఈ వీడియోను చిత్రీకరించారు.
ఈ వీడియోను ఆమె తాజాగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అది వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. 14 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``బాగుంది.. ఇంకోసారి ఇలా ట్రై చేయకండి``, ``వెరీ సర్‌ప్రైజింగ్``, ``చోటీ ఉర్ఫీ జావేద్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: తమ్ముడూ.. ఇలా అయితే వధువు పారిపోతుందేమో.. పెళ్లిలో వరుడి తుఫాన్ డ్యాన్స్ చూడండి..!
Viral Video: ఐదు సింహాలు చుట్టుముడితే ఎలా ఉంటుంది.. ఓ హిప్పో ఏం చేసిందో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..