Viral Video: ఆ కానిస్టేబుల్‌కు హ్యాట్సాఫ్.. ప్రాణాలకు తెగించి మరీ దొంగను ఎలా పట్టుకున్నాడో చూడండి..!
ABN , Publish Date - Aug 09 , 2024 | 09:44 PM
బెంగళూరు మహా నగరంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఓ యాక్షన్ సీన్‌ను తలపించే ఘటన జరిగింది. ఎన్నో కేసులు ఉన్న ఓ నేరస్థుడిని పట్టుకోవడం కోసం ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడాడు.
బెంగళూరు (Bengaluru) మహా నగరంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఓ యాక్షన్ సీన్‌ను తలపించే ఘటన జరిగింది. ఎన్నో కేసులు ఉన్న ఓ నేరస్థుడిని (Criminal) పట్టుకోవడం కోసం ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడాడు. బైక్ మీద వెళ్లిపోతున్న చైన్ స్నాచర్‌ను 50 ఏళ్ల వయసు గల ఆ కానిస్టేబుల్ (Bengaluru Cop) పోరాడిన తీరు ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఆ ఘటన మొత్తం సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
బెంగళూరులోని సదాశివనగర్‌లోని రద్దీగా ఉండే జంక్షన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన మంజేష్ అలియాస్ 420 మాంజా అలియాస్ హోట్టె మాంజ అనే నేరస్థుడు దాదాపు 40కి పైగా నేరాలకు పాల్పడ్డాడు. అతడిపై 10కి పైగా కేసులు ఉన్నాయి. అతడు కొన్ని రోజులుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బెంగళూరులోని సదాశివనగర్ జంక్షన్‌లో సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ దొడ్డలింగయ్యకు ఈ నెల 6వ తేదీన మంజేష్ కనిపించాడు. హెల్మెట్ పెట్టుకుని స్కూటీపై వెళుతున్న మంజేష్‌ను లింగయ్య గుర్తించాడు. ఒక్కసారిగా ముందుకు దూకి మంజేష్ స్కూటీని పట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన మంజేష్ స్కూటీని ముందుకు పోనిచ్చాడు.
స్కూటీ ముందుకు వెళ్లిపోతున్నా సరే లింగయ్య ఆగలేదు. ఆ స్కూటీ వెంట పరుగులు తీశాడు. కిందపడిపోయినా సరే లింగయ్య పట్టు వదల్లేదు. మంజేష్ కాలు పట్టుకుని కదలనీయలేదు. అక్కడ డ్యూటీలో ఉన్న ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వెంటనే పరిగెత్తుకు వెళ్లగా.. స్కూటీ వదిలి పారిపోయేందుకు మంజేష్ ప్రయత్నించాడు. ఇలోగా, మరికొంత మంది బైకర్స్ ముందుకు వచ్చి అతన్ని చితకబాది పట్టుకున్నారు. ప్రాణాలకు తెగించి నేరస్థుడిని పట్టుకున్న లింగయ్యను ఉన్నతాధికారులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Viral: 10 సెకెన్లలో 3 దేశాలను చూసెయ్యొచ్చు.. ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Viral Video: ఈ వీడియో చూస్తే దడుచుకోవాల్సిందే.. తనను తానే తినేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి