అధికార పార్టీ ఆగడాలకు పోలీసుల అండ
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:32 AM
పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 12: ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ ఆగడాలకు పోలీసు అధికారులు అండగా నిలుస్తున్నారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్యెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ.. జిల్లా ఎస్పీ మాధవరెడ్డికి ఫిర్యాదు చేశారు.
- వివాదాస్పద పోలీసులపై చర్యలు తీసుకోండి
- ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల ఫిర్యాదు
పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 12: ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ ఆగడాలకు పోలీసు అధికారులు అండగా నిలుస్తున్నారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్యెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ.. జిల్లా ఎస్పీ మాధవరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ మాధవరెడ్డిని సోమవారం కలిసి, ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మవరం పోలీసులు.. సోషల్ మీడియా నిర్వాహకులను అణచివేసేలా తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. వైసీపీ సోషల్ మీడియా మినహా మరెవరూ పోస్టులు పెట్టరాదంటూ భయభ్రాంతులకు లోనుచేస్తున్నారన్నారు. విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. అలాంటివి పునరావృతం కాకుండా సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.