Share News

జీబ్రా స్ట్రిప్పింగ్‌ తెలుసా?

ABN , Publish Date - Oct 20 , 2024 | 05:52 AM

నవంబర్‌ నుంచి ఇక వరుసగా పండగలు వస్తాయి. పండగలు వచ్చాయంటే ఫ్రెండ్స్‌ రావటం .. పార్టీలు చేసుకోవటం మామూలే! కొన్ని సార్లు ఈ పార్టీల వల్ల మర్నాడు ఉదయం హ్యాంగోవర్లు రావటం కూడా మామూలే! ఈ మధ్య కాలంలో

జీబ్రా స్ట్రిప్పింగ్‌ తెలుసా?

నవంబర్‌ నుంచి ఇక వరుసగా పండగలు వస్తాయి. పండగలు వచ్చాయంటే ఫ్రెండ్స్‌ రావటం .. పార్టీలు చేసుకోవటం మామూలే! కొన్ని సార్లు ఈ పార్టీల వల్ల మర్నాడు ఉదయం హ్యాంగోవర్లు రావటం కూడా మామూలే! ఈ మధ్య కాలంలో ఇలాంటి హ్యాంగో వర్లను తప్పించుకోవటానికి- జీబ్రా స్ట్రిప్పింగ్‌ అనే కొత్త పద్ధతిని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పద్ధతిలో ఆల్కహాల్‌ తాగిన వెంటనే నాన్‌ ఆల్కాహాలిక్‌ డ్రింక్స్‌ను తాగుతారు. దీని వల్ల అదనంగా ఆల్కహాల్‌ తాగటం తగ్గుతుంది. దీనితో లివర్‌పై ఒత్తిడి తక్కువ అవుతుంది. హ్యాంగోవర్‌ కూడా ఉండదు. ఇక పార్టీలకు వెళ్లే సమయంలోనే ముందుగానే ప్లాన్‌ చేసుకొమ్మని నిపుణులు సూచిస్తున్నారు. వీరి సూచనల ప్రకారం..

  • ముందుగానే ఎంత ఆల్కహాల్‌ తాగాలనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అంత కన్నా ఎక్కువ తాగకూడదు.

  • ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల మాక్‌టైల్స్‌ లభిస్తున్నాయి. వీలైనంత వరకు ఆల్కహాల్‌ బదులుగా ఈ మాక్‌టైల్స్‌ను తాగితే మంచిది.

  • ఇతరులు ఒత్తిడి చేస్తున్నారని వేగంగా ఆల్కహాల్‌ తాగకూడదు. వీలైనంత నెమ్మదిగా తాగాలి. దీని వల్ల ఆల్కహాల్‌ ఇన్‌టేక్‌ తగ్గుతుంది.

Updated Date - Oct 20 , 2024 | 05:52 AM