దివ్వెల పండగలో ధగధగలు
ABN , Publish Date - Oct 30 , 2024 | 06:16 AM
ఎరుపు, ఆకుపచ్చ, పసుపు... సాధారణంగా పట్టు చీరలంటే ఇవే రంగులు గుర్తుకొస్తాయి.
పండగ శోభ ప్రతిబింబించే దుస్తులు కచ్చితంగా పట్టు చీరలే! ఇప్పుడెన్నో రకాల పట్టుచీరలు మార్కెట్లో దొరుకుతున్నాయి. సౌకర్యానికి పెద్ద పీట వేస్తూనే, అరుదైన రంగులు, డిజైన్లలో రూపొందుతూ మహిళల మనసులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి పట్టు చీరల్లో ఇవి కొన్ని.
ఎరుపు, ఆకుపచ్చ, పసుపు... సాధారణంగా పట్టు చీరలంటే ఇవే రంగులు గుర్తుకొస్తాయి. అయితే బీజ్, పేల్ పింక్, ఓషన్ బ్లూ రంగుల పట్టు చీరలు ఎంచుకుంటే సంప్రదాయ వస్త్రధారణకు మోడర్న్ టచ్ ఇచ్చిన వారవుతారు. నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు.
ఇలా ఎంచుకోవాలి:
పట్టు చీరలు మోయలేని సుకుమారుల కోసం తయారైనవే సాఫ్ట్ సిల్క్ శారీస్. మెత్తగా, మృదువుగా, సౌకర్యంగా ఈ రకం పట్టు చీరల్లో కాంట్రాస్ట్ కలర్స్ ఎంచుకుంటే మరింత నాజూకుగా కనిపించవచ్చు.
పట్టు చీర అందమంతా అంచుల్లో, పవిటలో దాగుంటుంది. భారీ జరీ పనితనం ఉండి, అరుదైన డిజైన్లతో తయారైన పవిట చీర మొత్తానికే అందాన్నిస్తుంది.
ఎంచుకునే బ్లౌజు సరికొత్తగా ఉండాలి. పొడవు, పొట్టి, ఫ్లోయీ...ఇలా ఎలాంటి డిజైన్‌లో కుట్టించుకున్నా చీర పవిటకు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి.
కాంచీపురం, ధర్మవర, మైసూర్... ఒకటా రెండా కట్టుకోవడానికి బోలెడన్ని పట్టుచీరలు. జరీ భారీగా ఉండేవి కొన్నైతే, సుతిమెత్తని పట్టు సాఫ్ట్ సిల్క్‌తో తయారయ్యేవి మరికొన్ని. ఎలాంటి పట్టుతో తయారైనా సిల్క్ శారీస్ అందాలు వర్ణణాతీతం. అయితే ఒడ్డు, పొడవును బట్టి అంచు భారీగా ఉండాలా, చిన్నదిగా ఉండాలా? అనేది నిర్ణయించుకోవాలి.
ఎరుపు, ఆకుపచ్చ, పసుపు...
సాధారణంగా పట్టు చీరలంటే ఇవే రంగులు గుర్తుకొస్తాయి. అయితే బీజ్, పేల్ పింక్, ఓషన్ బ్లూ రంగుల పట్టు చీరలు ఎంచుకుంటే సంప్రదాయ వస్త్రధారణకు మోడర్న్ టచ్ ఇచ్చిన వారవుతారు. నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు.
చీర అంచుతో మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ధరించడం పాత ఫ్యాషన్. పట్టు చీరల విషయంలో మరికాస్త జాగ్రత్తగా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి. తాజా ట్రెండ్‌కు తగ్గట్టు చీర రంగుకు కాంట్రాస్ట్‌గా ఉండే బ్లౌజ్ అయితే సరికొత్తగా కనిపిస్తారు.