Share News

యోగాతో మధుమేహానికి చెక్‌!

ABN , Publish Date - Sep 12 , 2024 | 04:55 AM

యోగా చేస్తే మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయా? ఈ రెండింటికీ సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో సమాధానాలు లభించాయి. క్రమం తప్పకుండా

యోగాతో మధుమేహానికి చెక్‌!

యోగా చేస్తే మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయా? ఈ రెండింటికీ సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో సమాధానాలు లభించాయి. క్రమం తప్పకుండా ప్రతి రోజు 40 నిమిషాలు యోగా చేస్తే - మధుమేహం వచ్చే అవకాశాలు 40 శాతం తగ్గుతాయని అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం- మన దేశంలో 10 కోట్ల మంది మధుమేహ వ్యాధితో (టైప్‌ 2) బాధపడుతున్నారు. సుమారు 13 కోట్ల మంది మధుమేహ వ్యాధికి చేరువ (ప్రీ డయాబిటి్‌స)లో ఉన్నారు. ఇప్పటి దాకా కేవలం జీవన శైలిని మార్చుకోవటం ద్వారా మధుమేహానికి అడ్డుకట్ట వేయవచ్చని భావించేవారు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని అధ్యయనాలలో ఇది నిజం కాదని తేలింది. ‘‘మేము చేసిన అధ్యయనంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించాము. ఒక గ్రూపులో వారు జీవన శైలిని మాత్రమే మార్చుకొన్నారు. మరొక గ్రూపు వారు జీవన శైలిని మార్చుకోవటంతో పాటుగా ప్రతి రోజు 40 నిమిషాలు యోగా కూడా చేశారు. యోగా చేసిన వారిలో బ్లడ్‌ సుగర్‌ విలువలు నియంత్రణలోకి వచ్చాయి’’ అని ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ మధు వెల్లడించారు.

Updated Date - Sep 12 , 2024 | 04:55 AM