రీల్స్ మోజుకు కుటుంబం బలి
ABN , Publish Date - Sep 12 , 2024 | 05:09 AM
సరదా కోసమో, సంచలనం కోసమో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా యూపీలో ఓ కుటుంబం రీల్స్
పట్టాలపై రీల్స్ చేస్తుండగా దూసుకువచ్చిన రైలు
3 ఏళ్ల పిల్లాడితో పాటు తల్లిదండ్రుల దుర్మరణం
లక్ష్మీపూర్ ఖేరి(యూపీ), సెప్టెంబరు 11: సరదా కోసమో, సంచలనం కోసమో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా యూపీలో ఓ కుటుంబం రీల్స్ మోజుకు బలైపోయింది. రైలు పట్టాలపై రీల్స్ చేస్తున్న ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి అతని భార్య, 3 ఏళ్ల కుమారుడు దుర్మరణం పాలయ్యారు. రీల్స్ చేస్తుండగానే పట్టాలపై రైలు దూసుకు రావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఉమారియా గ్రామ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను సీతాపూర్ జిల్లాకు చెందిన మహమ్మద్ అహ్మాద్(26), అతని భార్య నజ్నీన్(24), వారి 3 ఏళ్ల కుమారుడు అబ్దుల్లాగా పోలీసులు గుర్తించారు.