Share News

సెంథిల్‌ బాలాజీ రాజీనామా?

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:50 AM

తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. విద్యుత్తు శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి అనేకమంది

సెంథిల్‌ బాలాజీ రాజీనామా?

చెన్నై, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. విద్యుత్తు శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి అనేకమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్టు గతేడాది ఆరోపణలు రావడంతో ఆయన నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఆ తర్వాత జూన్‌ 14న సెంథిల్‌ బాలాజీని అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన ఏ శాఖ లేని మంత్రిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే, సెంథిల్‌ బాలాజీ బెయిల్‌ పిటిషన్లు ట్రయల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వరుసగా తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది.

Updated Date - Feb 13 , 2024 | 08:21 AM