సోనియా నివాసం వద్ద నిరసన ప్రదర్శన
ABN , Publish Date - Sep 12 , 2024 | 05:25 AM
భారత్‌లో మతస్వేచ్ఛపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మద్దతు ఉన్న సిక్కుల గ్రూప్ ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసం ఎదుట నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ ప్రభుత్వంలో తాము సురక్షితంగా ఉన్నామని,
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: భారత్‌లో మతస్వేచ్ఛపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మద్దతు ఉన్న సిక్కుల గ్రూప్ ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసం ఎదుట నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ ప్రభుత్వంలో తాము సురక్షితంగా ఉన్నామని, తన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మరోవైపు, రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ బుధవారం ఫిర్యాదు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తన వ్యాఖ్యలతో సిక్కులను రెచ్చగొట్టేందుకు రాహుల్ ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో జిందాల్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని, ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలని ఫిర్యాదులో కోరానని జిందాల్ తెలిపారు.