Share News

పాకిస్థానీలు భారత్‌కు అతిపెద్ద సంపద

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:51 AM

వివాదాలకు కేంద్రం వంటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ మరోసారి తీవ్ర వివాదానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం పాకిస్థాన్‌లోని లోహోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాక్‌ను ప్రశంసలతో

పాకిస్థానీలు భారత్‌కు అతిపెద్ద సంపద

లాహోర్‌, ఫిబ్రవరి 12: వివాదాలకు కేంద్రం వంటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ మరోసారి తీవ్ర వివాదానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం పాకిస్థాన్‌లోని లోహోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాక్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. పాకిస్థానీలు భారత్‌కు అతి పెద్ద సంపద అని అభివర్ణించారు. కరాచీలో దౌత్యవేత్తగా పనిచేసిన కాలంలో తనను, తన భార్యను ఇక్కడి వారు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని తెలిపారు. ‘‘మీరు(పాకిస్థానీలు) ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్‌లో మోదీకి ఎప్పుడూ మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. దీనిని బట్టి మూడింట రెండు వంతుల మంది భారతీయులు మీవైపే ఉన్నారు’’ అని అయ్యర్‌ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు నిరాకరిస్తూ ప్రధాని మోదీ ‘అతిపెద్ద తప్పు’ చేశారని అన్నారు. ‘‘మీపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసే ధైర్యం మాకుంది. కానీ, కూర్చుని చర్చింకునే ధైర్యం మాత్రం లేదు’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - Feb 13 , 2024 | 04:51 AM