Jallikattu: జల్లికట్టు ఎద్దుల కొమ్ములకు రబ్బరు కవచాలు
ABN, Publish Date - Jan 02 , 2024 | 08:37 AM
జల్లికట్టు ఎద్దులను లొంగదీసుకొనే సాహసవంతులు గాయపడకుండా ఉండేలా కొమ్ములకు రబ్బరు కవచాలు తయారయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350కి పైగా ప్రాంతాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని జల్లికట్టు(Jallikattu) పోటీలు జరగనున్నాయి.
ఐసిఎఫ్(చెన్నై): జల్లికట్టు ఎద్దులను లొంగదీసుకొనే సాహసవంతులు గాయపడకుండా ఉండేలా కొమ్ములకు రబ్బరు కవచాలు తయారయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350కి పైగా ప్రాంతాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని జల్లికట్టు(Jallikattu) పోటీలు జరగనున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 50 నుంచి 60 ఎద్దులు మాత్రమే పోటీల్లో పాల్గొనాలి. అయితే అలంగానల్లూర్, పాలమేడు, అవనియాపురంలో జరిగే పోటీల్లో 600కు పైగా ఎద్దులను బరిలో దించుతున్నారు. 2022లో జరిగిన పోటీల్లో 9 ఎద్దులు, 950 మంది క్రీడాకారులు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 350 పోటీల్లో మొత్తం 8,000 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది జరగనున్న జల్లికట్టు పోటీల్లో ముందస్తు భద్రతా చర్యలుగా ఎద్దుల సంఖ్య తగ్గిచండంతోపాటు వాటికొమ్ములకు రబ్బరు, దృఢమైన ప్లాస్టిక్‌తో రూపొందించిన సురక్షితకవచం అమర్చేందుకు ప్రభు త్వం, జంతు సంక్షేమ బోర్డు నిర్ణయించాయి. ఆ ప్రకారం రూపొందించిన కవచాలను అవనియాపురంలో 15వ తేది, పాలమేడులో 16వ తేది, అలంగానల్లూర్‌లో 17వ తేదీల్లోజరిగే పోటీల్లో వీటిని ఉపయోగించనున్నారు.
Updated Date - Jan 02 , 2024 | 08:37 AM