Farmers Protest: సింగు బార్డర్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు
ABN , Publish Date - Feb 13 , 2024 | 08:05 AM
సింగు బార్డర్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. ఈ రైతు ఉద్యమానికి పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ సింగ్ సబ్రా నాయకత్వం వహిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ ఆందోళనలో 200 రైతు సంఘాలు పాల్గొన్నాయి.
ఢిల్లీ: సింగు బార్డర్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. ఈ రైతు ఉద్యమానికి పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ సింగ్ సబ్రా నాయకత్వం వహిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ ఆందోళనలో 200 రైతు సంఘాలు పాల్గొన్నాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన ఆందోళనను పూర్తి చేయడానికి... 9 రాష్ట్రాల రైతు సంఘాలు ముందుకు వచ్చాయి. పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు,మధ్యప్రదేశ్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.
అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టం తేవాలని, రుణ మాఫీ, పింఛన్లు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాలు నేడు ‘‘చలో ఢిల్లీ’’ కార్యక్రమం తలపెట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. నగరాన్ని అష్ట దిగ్బంధం చేశాయి. దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలయ్యేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ, పంజాబ్, హరియాణాతో ఉన్న సరిహద్దుల్లో జాతీయ రహదారులను పూర్తిగా మూసివేశారు.