Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Aug 10 , 2024 | 09:30 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-08-10T19:58:50+05:30
అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు.. అరెస్ట్..
నిందితున్ని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వాఖ్యలు చేస్తూ
సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వ్యక్తి.
తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ మాట్లాడిన వీడియోలను సేకరించి, స్పీకర్‌పై అనుచిత వాఖ్యలు చేసి, కించపరిచే విధంగా పోస్టు లు చేసి సోషల్ మీడియాలో వైరల్.
ఈ విషయంపై గతంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన అసెంబ్లీ కార్యదర్శి.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు..
వికారాబాద్ మోమిన్ పేటకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్.
రిమాండ్ తరలించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
విజయ్ కుమార్‌ను ఎవరు చెప్తే ఈ పోస్టులను వైరల్ చేశారు అన్న అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ కేసులో మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం.
-
2024-08-10T17:04:38+05:30
విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి.
ఇన్ ఫ్లో.. 2,78,182
కాలువలకు...14,357
15గేట్లు ఏడు అడుగులు, 55గేట్లు ఐదు అడుగులు ఎత్తి.. 2,63,825 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల.
-
2024-08-10T15:46:58+05:30
దువ్వాడ శ్రీనివాస్ బండారం బట్టబయలు చేసిన కూతురు హైందవి..
ఇల్లీగల్ రిలీషన్‌షిప్‌తో కుటుంబానికి దూరంగా ఉంటున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి ఆయన కూతురు హైందవి సంచలన కామెంట్స్ చేశారు. ఆయనకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
-
2024-08-10T14:15:23+05:30
అలర్లతో బంగ్లా సుప్రీం సీజే రాజీనామా..
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా
అల్లర్లతో సీజే పదవికి ఒబైదుల్లా హస్సన్ రాజీనామా
శనివారం ఉదయం ఢాకాలోని సుప్రీంకోర్టు వద్ద అల్లర్లు
సుప్రీంకోర్టును చుట్టుముట్టిన ఆందోళనకారులు
గంట వ్యవధిలో సీజే పదవికీ రాజీనామా చేయాలని అల్టిమేటం
రాజీనామా చేయకుంటే దేశవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల..
నివాసాలను చుట్టుముడుతామని హెచ్చరికలు
దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత న్యాయస్థానం..
దిగువ కోర్టుల న్యాయమూర్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వైదొలుగుతున్నట్లు ప్రకటన
సాయంత్రంలోగా రాజీనామా లేఖను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌కు..
పంపుతానని స్పష్టం చేసిన ఒబైదుల్లా హస్సన్
-
2024-08-10T13:45:06+05:30
అల్లర్లు కంటిన్యూ.. గంటలో సీజే దిగిపోవాలంటూ అల్టిమేటం
బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన అల్లర్లు
సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్న నిరసనకారులు
ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
సీజేతో పాటు ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు
న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చిన ప్రధాన న్యాయమూర్తి
తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని..
దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో చెలరేగిన నిరసనలు
ఈ క్రమంలో సుప్రీంకోర్టు వద్దకు చేరుకొని విద్యార్థులు, నిరసనకారులు ఆందోళన
ఈ చర్యలతో అర్ధంతరంగా ఆగిపోయిన న్యాయమూర్తుల సమావేశం
అక్కడికీ శాంతించక కోర్టును చుట్టుముట్టిన ఆందోళనకారులు
చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు
ఇంకా కొనసాగుతున్న అల్లర్లు.. ఇంతవరకూ స్పందించని సైన్యం..!
నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా కొనసాగుతున్న హింస
ఇళ్లను వదిలి భారత్‌కు తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్న పలు హిందూ కుటుంబాలు!
-
2024-08-10T13:40:55+05:30
క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
సచివాలయంలో కొత్త రేషన్ కార్డుల అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
పాల్గొన్న మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ చౌహన్, ఇతర అధికారులు
-
2024-08-10T13:12:38+05:30
వేధింపుల వల్లే..
హైదరాబాద్: ఇన్ స్టాలో యువకుడి పరిచయం.. ప్రేమ పేరుతో వేధింపులు
గుమ్మడిదల మండలం దోమడుగులో నాలుగో అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
బీ.ఫార్మసీ చదువుతున్న తేజస్విని
యువతి మృతికి కారణం శ్రీహరి
తేజస్విని ఆత్మహత్యతో భయపడి పురుగుల మందు తాగిన శ్రీహరి
చికిత్స కోసం సురారంలో గల మల్లారెడ్డి ఆస్పత్రికి తరలింపు
-
2024-08-10T13:03:58+05:30
అమన్ సెహ్రవత్‌కు పవన్ అభినందనలు
అమరావతి: ఒలింపిక్స్‌లో అమన్‌కు కాంస్య పతకం
అమన్ సెహ్రవత్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రెజ్లింగ్ విభాగంలో క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయం
దురదృష్టవశాత్తు వినేశ్ ఫోగాట్ ఫైనల్ పోటీకి దూరం.
అమన్ పతకం సాదించడంతో సంతోషంగా అభిమానులు: పవన్ కల్యాణ్
-
2024-08-10T13:00:54+05:30
భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్: భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు కొరియర్ చేస్తోండగా పట్టివేత
రూ.60 లక్షల విలువ చేసే 3 కిలోల ఎఫెడ్రిన్, సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లు సీజ్
ఇద్దరి అరెస్టు: డీఆర్ఐ అధికారులు
-
2024-08-10T12:54:00+05:30
విద్యార్థి మృతి
కుత్బుల్లాపూర్: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
యూనివర్సిటీలో విద్యార్థి అరుణ్ అనుమానాస్పద మృతి
అరుణ్ మృతిపై ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ధర్నా.
యూనివర్సిటీలో ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం.
వర్సిటీ ముందు భైఠాయించి విద్యార్థి సంఘాల రాస్తారోకో.
-
2024-08-10T12:45:23+05:30
దివ్వెల మాధురిని వాణి పరిచయం చేసింది
మాధురి రాజకీయంగా పనికొస్తుందని వాణి చెప్పింది.
మాధురితో సంబంధం ఉందని ఆరోపణలు చేసింది.
ఆరోపణలతో భర్త, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటోన్న మాధురి
మా వల్లే దివ్వెల మాధురి జీవితాన్ని నష్టపోయింది.
ఓ రోజు హోటల్‌లో తనను దివ్వెల మాధురి కలిసింది. ఆ వెంటనే ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది.
ఎలాగొలా దివ్వెల మాధురిని రక్షించాను.
కుటుంబంలో విలువలేని పరిస్థితి, భోజనం లేని పరిస్థితిని చూసి.. దివ్వెల మాధురికి దగ్గరయ్యా.
మేం బయటకు వెళ్లడం నిజమే. ఆలయానికి వెళ్లింది నిజమే
-
2024-08-10T12:36:52+05:30
దువ్వాడ వాణితో ప్రాణహాని ఉంది: శ్రీనివాస్
దువ్వాడ వాణి, రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రాణహని ఉంది: దువ్వాడ శ్రీనివాస్
నా పిల్లల ఆలనా పాలనా ఇప్పటికీ చూస్తా.
తండ్రిని కలిసేందుకు రాత్రి 11 గంటల సమయంలో వస్తారా..?
కారాలు, రోప్స్, గునాపాలు తీసుకొస్తారా.
నేను వెళితే కారం కొడతారు, దాడి చేస్తారు.
ప్రేమ లేక రాకపోవడం కాదు.. దువ్వాడ శ్రీనివాస్
దువ్వాడ వాణి ఆస్తి, అంతస్తుల గురించి ఏ రోజు నేను పట్టించుకోలే
పెద్ద కూతురుని దువ్వాడ వాణి తీసుకొని వచ్చింది.
గేటుకు గునపంతో కొట్టి వచ్చింది.
డోర్‌కు పవర్ బ్లేడ్ పెట్టడం కరెక్టేనా..?
భర్తను లేపెయడానికి ఇలా చేయడం కరెక్టా..?
ఇలాగే అన్ని కుటుంబాలు ఉన్నాయా..?
ఇలా ఉంటే కుటుంబ వ్యవస్థ ఉంటే బతకలేరు.
దువ్వాడ వాణికి బ్రహ్మండమైన బంగాళా కట్టించా
రూ.6 కోట్లతో ఇళ్లు కట్టించాను. ఆ ఇంట్లో నేను ఉన్నానా..? మీరు అనుభవిస్తున్నారు.. అనుభవించాలి.
ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు..?
30 ఏళ్లలో ఒకలా, రెండేళ్లలో మరొలా గొడవలు
గత 60 రోజుల్లో పరిస్థితి మారింది.
నా కష్టార్జీతం కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేది ఏమీ లేదు. అనాధశ్రమానికి రాసియొచ్చు
నా ప్రత్యర్థి గెలిచేందుకు దువ్వాడ వాణి, రాఘవరావు ప్రయత్నించారు.
నా ప్రయాణంలో విసిగిపోయా.
దేవుడి అయిన జగన్ ముందు, ప్రజల ముందు అవమానానికి గురయ్యా.
దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.
నాకు ఏమైనా జరిగితే అందుకు దువ్వాడ వాణి బాధ్యులు అవుతారు.
-
2024-08-10T12:18:12+05:30
ఏడాదిలో రూ.1.40 కోట్లు వాణికి పంపించా
ఎన్నో రోజులు రాత్రిళ్లు భోజనం చేయలేదు
పని వాళ్ల మీద ఆధారపడి బతికా
ఓ రోజు డంబెల్ తీసుకొని వాణి నాపై దాడి చేసింది
తప్పించుకునేందుకు బయటకు పరుగుతీశా
ఆ క్రమంలో నా కాలుకి ఫాక్చర్ అయ్యింది
ఎంపీ ఎన్నికల్లో గాయానికి కారణం అదే.. ఇన్ని రోజులు చెప్పలే.. ఇప్పుడు చెబుతున్నా
30 ఏళ్ల తర్వాత భయాల మధ్య, ద్వేషాల మధ్య, అసూయ మధ్య బతికా
క్వారీలో కారులో రాత్రంతా పడుకున్నా, అలాంటి రాత్రుళ్లు గడిపా
మా అమ్మ పిలిస్తే పలాస వెళ్లా.. ఏడాది అక్కడే ఉన్నా
తర్వాత ఇప్పుడు ఉన్న ఇల్లు స్థలం కొన్న, తర్వాత ఇల్లు కట్టుకున్నా
ఎన్నికలకు ముందు ఆస్తులను బదిలీ చేశా. ఫ్యాక్టరీ ఖరీదు రూ.20 కోట్లు
ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఈ రోజు వరకు రూ.కోటి నలభై లక్షలు ఇచ్చా.
అడిగిన వెంటనే డబ్బులు పంపా
ఏ నంబర్ నుంచి మెసేజ్ చేస్తే ఆ నంబర్‌కి డబ్బులు పంపా
-
2024-08-10T12:10:12+05:30
తల్లి కబురు పంపితే బయటకొచ్చి మాట్లాడిన దౌర్భగ్యుడిని: దువ్వాడ శ్రీనివాస్
2019లో ఎంపీ టికెట్ ఇస్తే మరికొంతమందిని ఉసిగొల్పింది: దువ్వాడ శ్రీనివాస్.
2024లో టెక్కలి నుంచి దువ్వాడ వాణి పేరు ప్రకటించాం.
కుటుంబం రోడ్డున పడొద్దని టికెట్ ఇప్పించా
పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేశా
వాణికి నియోజకవర్గంలో పేరు లేదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. దాంతో తన పేరు హైకమాండ్ ప్రకటించింది.
నాది గ్రానైట్ వ్యాపారం.. ఎంత డబ్బు వస్తే.. అంత మొత్తం వాణి చేతిలో పెట్టా.
భార్యను నమ్మాను. విశ్వసించా.. కానీ ఈ రోజు నా పిల్లలను ఉసిగొల్పింది.
టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే ఇంటికి తాళం వేసింది.
దువ్వాడ శ్రీనివాస్‌గా నేను ఎక్కడ ఉండాలి..?
25- 30 ఏళ్లలో ప్రతి సంవత్సరంలో అవమానాలను ఎదుర్కొన్నా: దువ్వాడ శ్రీనివాస్
30 ఏళ్ల జీవితంలో మా ఇంటికి నా తల్లి ఏ ఒక్క రోజు లోపలికి రాలేదు.
ఓ వ్యక్తితో కబురు చెబితే.. బయటకు వచ్చి మాట్లాడిన దౌర్భగ్యుడిని
నా తల్లికి ఆరోగ్యం బాగోలేకుంటే పలాస వెళ్లలేని దుస్థితి
ఒకవేళ పలాస వెళితే వారం, పది రోజులు నాకు టార్చర్
-
2024-08-10T12:00:02+05:30
దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్
కుటుంబ వ్యవస్థలో భర్తను గౌరవించాలి.. దువ్వాడ వాణి మాత్రం అలా కాదు
కుటుంబంలో భార్య ప్రశ్నించొచ్చు.. పిల్లలు ప్రశ్నించడం ఏంటీ.?
తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరెపించింది.
దువ్వాడ వాణి వల్లే హైందవి అలా తయారైంది.
-
2024-08-10T11:55:08+05:30
కూతురి హైందవి గురించి చెబుతూ దువ్వాడ కన్నీళ్లు..
రాజశేఖర్ రెడ్డితో స్నేహం.
చిరంజీవితో స్నేహం
జగన్ మోహన్ రెడ్డితో స్నేహం ఉంది.
హైందవిని గుండెమీద పెట్టుకొని పెంచా
నా పిల్లలకు మీ నాన్న ఇలాంటి వాడు అని విష ప్రచారం చేసింది.
మీ నాన్న ఇలా అలా అని పిల్లలను చెడగొట్టింది
కూతురు హైందవి గురించి చెబుతూ కన్నీళ్లు తెచ్చుకున్న దువ్వాడ శ్రీనివాస్
-
2024-08-10T11:51:16+05:30
విద్యార్థి దశ నుంచే నాపై కేసులు: దువ్వాడ శ్రీనివాస్
దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించేందుకు భార్య, కూతురు ప్రయత్నం
ఈ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నా.. ఏ రోజు అవినీతికి పాల్పడలేదు
నిజాయితీకి కట్టుబడుతూ పనిచేశా: దువ్వాడ
ఐదుసార్లు పోటీ చేసి ఓడిపోయా
దువ్వాడ వాణికి రాజకీయ ఆకాంక్ష ఉంది.
-
2024-08-10T11:46:24+05:30
ప్రజలకు సేవ చేయాలని జీవిస్తున్నా: దువ్వాడ శ్రీనివాస్
కుటుంబమే నాపై దాడి చేస్తోంది.
కుటుంబాన్ని ఏనాడు తక్కువ చేయలేదు
కుటుంబాన్ని కంటికి రెప్పాలా కాపాడుకున్నా
నా కష్టం కుటుంబాన్ని తాకనీవ్వలేదు
కుటుంబానికి ఎండ కూడా తగలనివ్వలే
నా కష్టాన్ని బాధను బిడ్డలకు తెలియనివ్వలే
నాకు పోలీసు కేసులు కొత్తకాదు: దువ్వాడ శ్రీనివాస్
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద రాత్రంతా ఉద్రిక్తత!
-
2024-08-10T11:41:49+05:30
మీడియాతో దువ్వాడ శ్రీనివాస్
25 ఏళ్ల నుంచి రాజకీయంలో యాక్టివ్‌గా ఉన్నా: దువ్వాడ శ్రీనివాస్
ఎన్నికల ముందు ఓ రాజకీయం.. ఎన్నికల తర్వాత మరో రాజకీయ నడుస్తోంది
-
2024-08-10T11:34:12+05:30
మొక్కనాటిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: ప్రధాని మోదీ పిలుపు మేరకు నివాసంలో మొక్క నాటిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
"ఏక్ పేడ్ మా కే నామ్" పేరుతో మొక్క నాటేందుకు ప్రధాని మోదీ పిలుపు
పర్యావరణం దెబ్బతిని, పచ్చదనం తగ్గుతోంది.. వాతావరణ సమతుల్యత కోల్పోయి ప్రకృతి వైపరీత్యాలు
పట్టణ ప్రాంతాలకు పెరుగుతున్న వలసలు
అమ్మ పేరుతో మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపు
దేశాన్ని భారతమాతగా, భూమిని భూమాతగా భావిస్తాం
రెండింటినీ కాపాడుకోవడం కోసం మొక్క నాటాలి.
దేశంలో 140 కోట్ల ప్రజలు పాల్గొనాలని మోదీ పిలుపు
-
2024-08-10T11:28:40+05:30
బూతులు మాట్లాడేవారికి ఓట్లతో ప్రజలు బుద్ది చెబుతారు: వెంకయ్యనాయుడు
బాపట్ల: చిన్నతనంలో గేదె పొడవడంతో మా అమ్మ చనిపోయింది: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అమ్మమ్మ తాతయ్య వద్దే లోక జ్ఞానం నేర్చుకున్నా
మా తాతతోపాటు పొలం పనులుకు వెళ్ళేవాడిని.
వ్యవసాయం మన సంస్కృతి, మన సంప్రాదయం.
రాజకీయాల్లో ఒక్కటే మార్గం.. ఒక్క పార్టీలో ఈ స్థాయికి వచ్చా.
మహనీయుల జీవిత చరిత్ర నేటి తరాలకు తెలియజేయాలి.
అమరావతిలో మహనీయుల జీవిత చరిత్ర మ్యూజియం ఏర్పాటు చేయాలి.
గత ప్రభుత్వంలో అసెంబ్లీ లో బూతులు మాట్లాడారు.
బూతులు మాట్లాడేవారికి ఓట్లతో ప్రజలు బుద్ది చెబుతారు.
ప్రజా జీవితంలో ఉన్న నాయకులు హుందాగా ఉండాలి.
నిస్వార్థ సేవా తత్పరుడు మాజీ ఎమ్మెల్యే కుప్పుస్వామి చౌదరి
-
2024-08-10T11:20:57+05:30
కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పన పై సమీక్ష
హైదరాబాద్: కాసేపట్లో సచివాలయంలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ
మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు
కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ విధి విధానాల రూపకల్పన పై సమీక్ష
-
2024-08-10T11:05:48+05:30
వయనాడుకు ప్రధాని మోదీ
ఢిల్లీ: కేరళలో గల కన్నూర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వయనాడ్‌లో ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటన
సహాయ చర్యలను సమీక్షించేందుకు వయనాడ్‌కు మోదీ
కేరళ ప్రభుత్వంతో ప్రధాని మోదీ సమీక్ష
రూ.2 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం
జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ డిమాండ్
-
2024-08-10T10:42:22+05:30
ఏసీబీ కోర్టుకు రెవెన్యూ అధికారి నరేందర్
నిజామాబాద్: మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో కొనసాగుతునున్న ఏసీబీ సోదాలు
నేడు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయనున్న అధికారులు
నిజామాబాద్, నిర్మల్, మహారాష్ట్రలో స్థిరాస్తుల గుర్తింపు
ఇతర స్థిరాస్తులపై విచారణ
కారుణ్య నియామకం ద్వారా బిల్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నరేందర్
ప్రమోషన్లతో రెవెన్యూ అధికారిగా నరేందర్
రాష్ట్రంలో అత్యధిక నగదు పట్టుబడిన కేసు ఇదే అంటున్న ఏసీబీ అధికారులు
ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు
హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు నరేందర్ తరలింపు
-
2024-08-10T10:36:06+05:30
తెలంగాణపై నజర్
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్
సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ భవన్‌కు టీడీపీ చంద్రబాబు
ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశం
ఆడహక్ కమిటీ వేసి జిల్లాలవారీగా సభ్యత్వ నమోదు చేపట్టే అవకాశం
బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై శ్రేణులకు దిశానిర్దేశం
తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిపై అభిప్రాయ సేకరణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
-
2024-08-10T10:27:12+05:30
గాజాపై ఇజ్రాయెల్ దాడి
గాజాలో ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి
100 మంది పాలస్తీనీయుల మృతి, పలువురికి గాయాలు
ప్రార్థనలు చేసే సమయంలో ఇజ్రాయెల్ దాడి
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
2024-08-10T10:10:27+05:30
న్యాయం కావాల్సిందే..!
దువ్వాడ ఫ్యామిలీ హైడ్రామా కంటిన్యూ..!
టెక్కలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద..
కొనసాగుతున్న భార్య వాణి, పిల్లల నిరసన
రాత్రంతా దువ్వాడ ఇంటి ఆరుబయటనే..
నిద్రించిన భార్య వాణి, పెద్ద కుమార్తె హైందవి
ఇంట్లొనే ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
సమష్యకు పరిష్కారం లభించేంత వరకూ ఇక్కడే ఉంటామంటున్న భార్యాబిడ్డలు
-
2024-08-10T09:36:54+05:30
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత
నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నిందితులు
నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు
కేసు విచారణ కీలక దశలో ఉంది, బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల వాదన
పోలీసు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు
నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు.
-
2024-08-10T09:32:46+05:30
లోక్ సభ స్పీకర్ తేనిటి విందు
తేనిటి విందుకు హాజరైన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఆప్యాయ పలకరింపు
చిరునవ్వులతో ఫొటోలకు ఫోజులు, పిక్స్ వైరల్
ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ, విపక్ష నేతలు కలువడంతో ప్రాధాన్యం
-
2024-08-10T09:29:53+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.