నెతన్యాహు ప్రైవేట్ నివాసంపై హెజ్‌బొల్లా డ్రోన్ దాడి
ABN , Publish Date - Oct 20 , 2024 | 05:37 AM
సెంట్రల్ ఇజ్రాయెల్ సిజేరియా నగరంలోని నెతన్యాహు ప్రైవేట్ నివాసంపై హెజ్‌బొల్లా శనివారం డ్రోన్ దాడి జరిపింది. దాడి సమయంలో ఇంట్లో నెతన్యాహు,
టెల్ అవీవ్, గాజా, బీరుట్, అక్టోబరు 19: సెంట్రల్ ఇజ్రాయెల్ సిజేరియా నగరంలోని నెతన్యాహు ప్రైవేట్ నివాసంపై హెజ్‌బొల్లా శనివారం డ్రోన్ దాడి జరిపింది. దాడి సమయంలో ఇంట్లో నెతన్యాహు, ఆయన సతీమణి సారా లేరని, ఎవ్వరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని సిజేరియాలో ఉన్న నెతన్యాహు ప్రైవేట్ నివాసంపై హెజ్‌బొల్లా డ్రోన్ దాడి జరపడాన్ని భద్రతా వైఫల్యంగా భావించిన ఇజ్రాయెల్ ఆర్మీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. హెజ్‌బొల్లా మూడు డ్రోన్లు ప్రయోగించగా తాము రెండింటిని కూల్చివేశామని ప్రకటించింది. డ్రోన్ దాడిపై నెతన్యాహు స్పందించారు. తమనెవరూ నిలువరించలేరని, యుద్ధంలో విజయం సాధించి తీరతామని అన్నారు. ఈ డ్రోన్ దాడిలో ఇరాన్ ప్రమేయముందని ఓ ప్రభుత్వ అధికారి ధృవీకరించారంటూ ఇజ్రాయెల్ మీడి యా సంస్థ ఛానెల్ 12 తెలిపింది. మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 50 మంది చనిపోయారు.