నిఫ్టీ @ : 25,000 ఇంట్రాడేలో 82,000 స్థాయికి సెన్సెక్స్
ABN , Publish Date - Aug 02 , 2024 | 02:53 AM
స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజూ సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఎన్‌ఎ్‌సఈ ప్రధాన సూచీ నిఫ్టీ తొలిసారిగా 25,000 మైలురాయి ని దాటగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 82,000 స్థాయిని చేరుకుంది...
నిఫ్టీ @ : 25,000
ఇంట్రాడేలో 82,000 స్థాయికి సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజూ సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఎన్‌ఎ్‌సఈ ప్రధాన సూచీ నిఫ్టీ తొలిసారిగా 25,000 మైలురాయి ని దాటగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 82,000 స్థాయిని చేరుకుంది. సెప్టెంబరు నుంచి వడ్డీరేట్లను తగ్గిస్తామని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఆయిల్ రంగ షేర్లలో కొనుగోళ్లకు పాల్పడటం ఇందుకు దోహదపడింది. సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్‌లో 388.15 పాయింట్ల వరకు పెరిగి 82,129.49 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. అయితే, ఐరోపా, ఆసియా మార్కె ట్ల బలహీన సంకేతాలు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మన సూచీలూ క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మధ్యాహ్నం సెషన్‌లో లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన సెన్సెక్స్.. చివరికి 126.21 పాయింట్ల పెరుగుదలతో జీవితకాల గరి ష్ఠ స్థాయి 81,867.55 వద్ద స్థిరపడింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 127.15 పాయింట్ల వరకు పెరిగి 25,078.30 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసిన నిఫ్టీ చివరికి 59.75 పాయింట్ల లాభంతో 25,010.90 వద్ద క్లోజైంది. నిఫ్టీ 25000 పైన ముగియడం ఇదే ప్రథమం.
24 రోజుల్లో 1,000 పాయింట్ల వృద్ధి
కేవలం 24 ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 24,000 నుంచి 25,000 స్థాయికి చేరుకుంది. సూచీకిది మూడో అత్యంత వేగవంతమైన 1,000 పాయింట్ల వృద్ధి. నిఫ్టీ 23,000 నుంచి 24,000కు 23 సెషన్లలో పుంజుకుంది. అది రెండో అత్యంత వేగవంతమైన ర్యాలీ. కాగా, 2021 ఆగస్టులో సూచీ కేవలం 19 ట్రేడింగ్ సెషన్లలో 16,000 నుంచి 17,000 పాయింట్లకు ఎగబాకింది. ఇప్పటివరకు సూచీకిదే అత్యంత వేగవంతమైన 1,000 పాయింట్ల వృద్ధి.
221 రోజుల్లో 5,000 పాయింట్ల ర్యాలీ
గత ఏడాది సెప్టెంబరు 11న తొలిసారిగా 20,000 మైలురాయికి చేరిన నిఫ్టీ.. గడిచిన 221 ట్రేడింగ్ సెషన్లలో 5,000 పాయింట్లు పెరిగి 25,000 స్థాయికి అధిరోహించింది. ఈ ర్యాలీలో సూచీలోని 50 కంపెనీల షేర్లలో 45 పాజిటివ్ రిటర్నులు పంచాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు టాప్ గెయినర్లు గా నిలిచాయి. నిఫ్టీ 50 సూచీని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి 1,000 బేస్ పాయింట్లతో 1,996 ఏప్రిల్ 22న ప్రారంభించింది.
ఐపీఓకు హీరో ఫిన్‌కార్ప్
హీరోమోటోకార్ప్ ఆర్థిక సేవల విభాగం హీరో ఫిన్‌కార్ప్ ఐపీఓకు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా రూ.3,668 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా సంస్థ రూ.2,100 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాఆటు ఇన్వెస్టర్లకు చెందిన రూ.1,568 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించాలనుకుంటోంది.
ఫస్ట్ క్రై ఇష్యూ ధర రూ.440-465
ఫస్ట్ క్రై మాతృసంస్థ బ్రెయిన్‌బీ్‌స సొల్యూషన్స్ లిమిటెడ్ వచ్చే నెల 6న విడుదల చేయనున్న ఐపీఓలో ధరల శ్రేణి ని రూ.440-465గా నిర్ణయించింది. తద్వారా రూ.4,194 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది.
అదే రోజు విడుదల కాను న్న యూనికామర్స్ ఈ-సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ ధరల శ్రేణిని రూ.102-108గా నిర్ణయించింది.
కీలక మైలురాళ్లివే...
5,000 2007 సెప్టెంబరు 27
10,000 2017 జూలై 25
15,000 2021 ఫిబ్రవరి 5
20,000 2023 సెప్టెంబరు 11
21,000 2023 డిసెంబరు 14
22,000 2024 జనవరి 15
23,000 2024 మే 25
24,000 2024 జూన్ 27
25,000 2024 ఆగస్టు 1