సృష్టికి ప్రతిసృష్టి చేయగలడు
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:49 AM
పేగుబంధంతో బిడ్డలను తీర్చిదిద్దేది తల్లిదండ్రులైతే... ఏ బంధం లేని ఆ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దేది గురువులు నుదిటి రాతను రాసేది బ్రహ్మైతే... భవిష్యత్తు రాతను రాసేది గురువు ప్రకృతి సంపద సృష్టికర్త భగవంతుడైతే..
పేగుబంధంతో బిడ్డలను తీర్చిదిద్దేది తల్లిదండ్రులైతే...
ఏ బంధం లేని ఆ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దేది గురువులు
నుదిటి రాతను రాసేది బ్రహ్మైతే...
భవిష్యత్తు రాతను రాసేది గురువు
ప్రకృతి సంపద సృష్టికర్త భగవంతుడైతే...
ఆ ప్రకృతిలోని జ్ఞాన సంపద సృష్టికర్త గురువు
దేశాభివృద్ధిలో కీలకమైనది యువశక్తైతే...
ఆ యువశక్తిని శక్తివంతం చేసేది గురువు
పురోభివృద్ధికి అవసరమైనది జ్ఞానం అనుభవమైతే...
ఆ జ్ఞానాన్ని అనుభవాన్ని ప్రసరింపజేసేది గురువు
సామరస్య సమ్మిళిత సమాజ నిర్మాణానికి కావలసింది ఐక్యతా భావమైతే...
ఆ ఐక్యతా భావాన్ని పెంపొందించేది గురువు
దేశ పురోభివృద్ధికి అవసరమైనది భవిష్యత్తరమైతే...
ఆ భవిష్యత్తరాన్ని ప్రభావితం చేయగల జ్ఞాన శక్తి గురువు
సృజనాత్మకత, సాంకేతికత, పారిశ్రామిక విప్లవాలను తీసుకొచ్చేది విద్యాధికులైతే...
ఆ విద్యాధికులకు స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శకుడు గురువు
నాయకులు, సైనికులు, ఆవిష్కర్తలు, బాధ్యత గల పౌరులు దేశానికి వెన్నుముకైతే...
ఆ వెన్నుముక నిర్మాణంలో మూల స్తంభమైన గురువుకు వందనం... పాదాభివందనం
ననుబోలు రాజశేఖర్