కొలిచే దైవం
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:47 AM
మనసుని చెక్కే విద్యతో జీవితానికి పునాదిలా అక్షరమై నుదుట వ్రాతలో బతుకును మలిచేవాడు దేవుడు రూపాన్ని ధరించి ప్రేమగా బుద్దులు గుద్ది చెప్పి తీపి కలకు అల్లిక నేర్పి...
మనసుని చెక్కే విద్యతో
జీవితానికి పునాదిలా
అక్షరమై నుదుట వ్రాతలో
బతుకును మలిచేవాడు
దేవుడు రూపాన్ని ధరించి
ప్రేమగా బుద్దులు గుద్ది చెప్పి
తీపి కలకు అల్లిక నేర్పి
మంచి మనిషిగా తీర్చువాడు.
విలువ రుచిని రంగరించి
మనసు పాదున చిలరించి
చక్కని మొక్కలా నిలిపి
మంచి ఫలాల్ని కానించే వాడు
ప్రతి జీవితంలో తప్పని పాత్రలా
ప్రతి గుండెలో మరువని బంధంలా
ప్రతి నోరూ కొలిచే దైవం
ప్రతి చేయి పూజించే ఇష్టం ఉపాధ్యాయుడు.
చందలూరి నారాయణరావు