సంగం డెయిరీ లాభం రూ.12 కోట్లు
ABN , Publish Date - Sep 12 , 2024 | 02:57 AM
సంగం డెయిరీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1877 కోట్ల టర్నోవర్ సాధించినట్లు కంపెనీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ తెలిపారు. బుధవారం సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం సందర్భంగా...
పొన్నూరుటౌన్ (చేబ్రోలు): సంగం డెయిరీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1877 కోట్ల టర్నోవర్ సాధించినట్లు కంపెనీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ తెలిపారు. బుధవారం సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రైతులకు బోనస్ చెల్లించిన తర్వాత డెయిరీ లాభం రూ.12 కోట్లని చెప్పారు. రానున్న రోజుల్లో అనంతపురం సహా ఐదు చోట్ల బల్క్ మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటీవలే తెలంగాణలో ప్లాంట్‌ను లాంఛనంగా ప్రారంభించామని త్వరలోనే తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించనునట్లు చెప్పారు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళంగా ఇవ్వాలని కూడా తీర్మానించినట్లు చెప్పారు. వరదలో నష్టపోయిన సంగం పాల ఉత్పత్తిదారులకు 70 మెట్రిక్ టన్నుల పశు దాణాని ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు.