Share News

రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్‌ షురూ

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:04 AM

ప్రజలు మరింతగా విద్యుత్‌ వాహనాలు (ఈవీ) వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రకటించిన పీఎం ఈ-డ్రైవ్‌ పథకాన్ని రూ.10,900 కోట్ల పెట్టుబడితో మంగళవారం ప్రారంభించారు. ఈవీల వినియోగానికి ప్రజలను ఆకర్షించడం, చార్జింగ్‌ మౌలిక వసతుల...

రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్‌ షురూ

న్యూఢిల్లీ: ప్రజలు మరింతగా విద్యుత్‌ వాహనాలు (ఈవీ) వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రకటించిన పీఎం ఈ-డ్రైవ్‌ పథకాన్ని రూ.10,900 కోట్ల పెట్టుబడితో మంగళవారం ప్రారంభించారు. ఈవీల వినియోగానికి ప్రజలను ఆకర్షించడం, చార్జింగ్‌ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యుత్‌ వాహనాల తయారీకి అనుకూల వాతావరణం కల్పించడం ఈ పథకం లక్ష్యాలు. 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. సోమవారం నాటితో గడువు ముగిసిపోయిన ఈఎంపీఎస్‌-2024 పథకం ఇందులో విలీనమవుతుంది. ఒక్కో ఆధార్‌ కార్డుపై ఒక్కో వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని, వాహనం కొనుగోలు సమయంలో స్కీమ్‌ పోర్టల్‌ ఆ ఆధార్‌ కార్డు అసలైనదేనని ధ్రువీకరించగానే దానిపై ఈ వోచర్‌ జారీ అవుతుందని, ఈ వోచర్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ కూడా సంబంధిత వ్యక్తి మొబైల్‌ నంబర్‌కు పంపుతారని ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా భారీ పరిశ్రమల శాఖ అడిషనల్‌ కార్యదర్శి హనీఫ్‌ ఖురేషి చెప్పారు.


ఈ వోచర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని కస్టమర్‌ దానిపై సంతకం పెట్టి డీలర్‌కి ఇవ్వగానే డీలర్‌ కూడా సంతకం చేసి పీఎం ఈ-డ్రైవ్‌ పోర్టల్‌కు అప్‌లోడ్‌ చేస్తారని, దాని ఆధారంగానే సంబంధిత ఓఈఎం సబ్సిడీ రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 01:04 AM