ఎంజీ కొత్త కారు విండ్సర్
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:03 AM
జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్.. ‘విండ్సర్ ఈవీ’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది హ్యాచ్‌బాక్, మల్టీ యుటిలిటీ వెహికిల్ (ఎంయూవీ) ఫీచర్లతో కూడిన తొలి ఎలక్ట్రిక్ ‘క్రాసోవర్ యుటిలిటీ వెహికిల్’...
ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
న్యూఢిల్లీ: జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్.. ‘విండ్సర్ ఈవీ’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది హ్యాచ్‌బాక్, మల్టీ యుటిలిటీ వెహికిల్ (ఎంయూవీ) ఫీచర్లతో కూడిన తొలి ఎలక్ట్రిక్ ‘క్రాసోవర్ యుటిలిటీ వెహికిల్’ (ఈ-సీయూవీ) అని కంపెనీ తెలిపింది. మొత్తం మూడు వేరియంట్లలో (ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎస్సెన్స్) లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. అయితే, ఇది బ్యాటరీ రహిత ధర. వాహన ఇండస్ట్రీలో తొలిసారిగా కంపెనీ ఈ కారు బ్యాటరీని అద్దెకు (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) ఇస్తోంది. ఈ బ్యాటరీ ప్యాక్‌కు కిలోమీటరుకు రూ.3.5 చొప్పు న చెల్లించాల్సి ఉంటుంది. ఎంజీ యాప్ ఈ-హబ్ ద్వారా ఏడాదిపాటు పబ్లిక్ చార్జర్ల వద్ద ఉచితంగా చార్జింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు, కారు మొదటి యజమానికి జీవితకాలం బ్యాటరీ వారంటీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. మూడేళ్లు లేదా 45,000 కి.మీ తర్వాత 60 శాతం బైబ్యాక్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. విండ్సర్ ప్రీ-బుకింగ్‌లు తక్షణమే ప్రారంభయ్యాయి. ఈనెల 25 నుంచి టెస్ట్ డ్రైవ్ కోసం ఈ వాహనాన్ని షోరూముల్లో అందుబాటులో ఉంచనున్నారు.
వచ్చేనెల 3 నుంచి అధికారిక బుకింగ్ ప్రారంభం కానుంది. దసరా నుంచి డెలివరీని ప్రారంభించే అవకాశం ఉంది. 38 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీతో కూడిన ఈ కారు పూర్తి చార్జింగ్‌తో 331 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. ఏదైనా డీసీ ఫాస్ట్ చార్జర్‌తో 40 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయవచ్చు.
కారు ప్రధాన ఫీచర్లు
2,700 ఎంఎం వీల్‌బేస్, 1,850 ఎంఎం విడ్త్, 1,677 ఎంఎం ఎత్తు
15.6 అంగుళాల గ్రాండ్ వ్యూ టచ్‌స్ర్కీన్ విత్ వైర్‌లెస్ కనెక్టివిటీ
135 డిగ్రీస్ రిక్లైనింగ్ ఏరో లాంజ్ సీట్స్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్
ఇన్ఫినిటీ వ్యూ పనోరమిక్ గ్లాస్ రూఫ్, 604 లీటర్ల బూట్ స్పేస్
360 డిగ్రీస్ కెమెరా, యాంబియెంట్ లైటింగ్, 4 ఎయిర్ బ్యాగ్‌లు
ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్