మూడో రోజూ నష్టాలే..
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:05 AM
సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్ 33.49 పాయింట్లు కోల్పోయి 84,266.29 వద్దకు జారుకోగా...
ముంబై: సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్ 33.49 పాయింట్లు కోల్పోయి 84,266.29 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 13.95 పాయింట్ల నష్టంతో 25,796.90 వద్ద స్థిరపడింది. గడిచిన 3ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,570 పాయింట్లు (దాదాపు 2 శాతం), నిఫ్టీ 419 పాయింట్లు (1.6 శాతం) క్షీణించాయి.
ఒకే రోజు 13 కంపెనీలు ఐపీఓలకు దరఖాస్తు: పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు వచ్చేందుకు కంపెనీలు భారీగా క్యూ కడుతున్నాయి. మంగళవారం ఏకంగా 13 కంపెనీలు ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన మిడ్‌వెస్ట్ కూడా ఉంది. మిగిలిన కంపెనీల్లో విక్రమ్ సోలార్, సంభవ్ స్టీల్, రాహీ ఇన్‌ఫ్రాటెక్, అజాక్స్ ఇంజనీరింగ్ సహా మరికొన్ని ఉన్నాయి. ఈ 13 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి.
మిడ్‌వెస్ట్ రూ.650 కోట్ల సమీకరణ: దేశంలోని అతిపెద్ద బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన హైదరాబాద్ సంస్థ మిడ్ వెస్ట్ ఐపీఓ ద్వారా రూ.650 కోట్లు సమీకరించాలనుకుంటోంది. అందులో రూ.250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్లు కొల్లా రెడ్డి రామ రాఘవ రెడ్డి, గుంటక రవీంద్ర రెడ్డికి చెందిన రూ.400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఓఎ్‌ఫఎస్ పద్ధతిన విక్రయించనున్నారు.